
వట్టెం ప్రాజెక్టును పరిశీలిస్తున్న ఎంపీ రంజీత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు తదితరులు
భూత్పూర్/ బిజినేపల్లి: పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తయితే పరిగి, చేవేళ్ల, వికారాబాద్‌కు సాగునీరు వస్తుందని చేవేళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి అన్నా రు. ఆదివారం వికారాబాద్ ఎమ్మెల్యే ఎం.ఆనంద్, పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్వర్‌రెడ్డితోపాటు 600 మందికిపైగా ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి 80కిపైగా కార్లలో నాగర్‌కర్నూ ల్ జిల్లా వట్టెం, మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలంలోని కర్వెన ప్రాజెక్టును పరిశీలించారు. జలాశయంలో నీటినిల్వ, పంపింగ్‌ను ప్రత్యేకంగా తిలకించి పనితీరును ప్రాజెక్టు కాంట్రాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు సామర్థ్యం, నీటి తరలింపు, సాగు విస్తీర్ణం, ప్రాజెక్టుతో రైతులకు కలిగే ప్ర యోజనాలు ఎంపీ రంజిత్‌రెడ్డి వివరించారు. అనంతరం 15వ ప్యాకేజీలోని ప్రసాద్ ఇన్‌ఫ్రా కంపెనీలో మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత ప్రాజెక్టు ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. సీఎం కేసీఆర్ ప్రాజెక్టు సందర్శన, ప్రాజెక్టులో చేపట్టిన పనులను ఫొటోలను పరిశీలించారు. వీరి వెంట అడ్డాకుల జెడ్పీటీసీ సభ్యుడు రాజశేఖర్‌రెడ్డి, ప్రసాద్ ఇన్‌ఫ్రా జీఎం రామరాజు, ప్రాజెక్టు అధికారులు విజయభాస్కర్‌రెడ్డి, సత్యనారాయణరెడ్డి, రమేష్, నాయకులు యాదిరెడ్డి, మాధవరెడ్డి, మల్లేష్, బాలేమియా, ఉపసర్పంచ్ బాల్‌రెడ్డి తదితరులున్నారు.