రైతు బజార్‌ ప్రారంభోత్సవంలో ప్రొటోకాల్‌ ఉల్లంఘన | - | Sakshi
Sakshi News home page

రైతు బజార్‌ ప్రారంభోత్సవంలో ప్రొటోకాల్‌ ఉల్లంఘన

Sep 17 2026 12:50 AM | Updated on Sep 17 2026 12:50 AM

రైతు బజార్‌ ప్రారంభోత్సవంలో ప్రొటోకాల్‌ ఉల్లంఘన

మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ గేదెల

గాయత్రికి ఆహ్వనం లేకుండానే కార్యక్రమం

వ్యవసాయ మార్కెట్‌ కమిటీ నిధులతో రైతుబజార్‌ నిర్మాణం

పూసపాటిరేగ: భోగాపురం రైతు బజార్‌ ప్రారంభోత్సవంలో అధికారులు ప్రొటోకాల్‌ ఉల్లంఘించారు. వ్యవసాయ మార్కెట్‌ నిధులతో నిర్మాణాలు చేసి సంబంధిత శాఖ చైర్‌పర్సన్‌ గేదెల గాయత్రికి ఆహ్వానం ఇవ్వకుండానే ప్రారంభాలు చేయడంతో వ్యవసాయ మార్కెట్‌ అధికారుల తీరుపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి ముఖ్య అతిథిగా హాజరై బుధవారం ఉదయం 8.30 సమయంలో భోగాపురం రైతు బజార్‌ను హడావిడిగా ప్రారంబించారు. వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ గేదెల గాయత్రి టీడీపీ వర్గానికి చెందిన వ్యక్తి కావడం, నెల్లిమర్ల ఎంఎల్‌ఏ లోకం నాగమాధవి జనసేన కావడంతో మార్కెట్‌ కమిటీ కార్యక్రమాలపై కొంత కాలంగా వర్గపోరు నడుస్తోంది. దీనిలో భాగంగా అధికారుల ప్రోద్బలంతోనే చైర్‌పర్సన్‌ గేదెల గాయత్రిని విస్మరించారనే చర్చ సాగుతోంది.

రైతు బజార్‌ భూములు మావే

భోగాపురంలో నిర్మాణం చేసిన రైతు బజార్‌ భూములు తమవే అని బావిశెట్టి తిరుమలవేణి పేరిట రైతుబజారు గేటుకు బ్యానర్‌ వెలిసింది. రైతు బజారు ప్రారంభోత్సవం జరిగిన గంట వ్యవధిలోనే బ్యానర్‌ వెలిసింది. సుమారు రూ.74 లక్షల ప్రభుత్వ నిధులతో నిర్మాణాలు చేయడం విదితమే. లక్షలాది రుపాయలు ప్రభుత్వ నిధుల మాటేమటని పలువురు విస్మయం చెందుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement