ఘనంగా ప్రపంచ ఓజోన్‌ దినోత్సవం | - | Sakshi
Sakshi News home page

ఘనంగా ప్రపంచ ఓజోన్‌ దినోత్సవం

Sep 17 2026 12:50 AM | Updated on Sep 17 2026 12:50 AM

ఘనంగా ప్రపంచ ఓజోన్‌ దినోత్సవం

విజయనగరం అర్బన్‌: మహారాజా అటానమస్‌ కళాశాల రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ప్రపంచ ఓజోన్‌ దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఏపీ కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణ ఇంజినీర్‌ బీబీ సరిత, సెంట్రల్‌ ట్రైబల్‌ యూనివర్సిటీ రసాయన శాస్త్ర అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ చంద్రశేఖర్‌ శరప్‌ ముఖ్య వ్యక్తలుగా పాల్గొన్నారు. ఓజోన్‌ పొర సూ ర్యుడి నుంచి వెలువడే హానికర అతినీలలోహిత కిరణాల నుంచి భూమిపై జీవరాశులను కాపాడే రక్షణ కవచమని వక్తలు తెలిపారు. క్లోరోఫ్లోరో కార్బన్లు (సీఎఫ్‌సీలు) వంటి రసాయనాల వల్ల ఓజోన్‌ పొర కు కలుగుతున్న నష్టాన్ని వివరించారు. పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడం, సహజ వనరులను సంరక్షించడం, మొక్కలను పెంచడం ద్వారా ప్రతి ఒక్క రూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావా లని సూచించారు. ముఖ్య వక్తలను ఘనంగా సత్కరించారు. కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ ఎం.సాంబశివరావు, రసాయన శాస్త్ర విభాగాధిపతి డాక్టర్‌ టి.సుధ, అధ్యాపకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement