విజయనగరం ఫోర్ట్: జిల్లా వ్యవసాయ అధికారిగా ఎం.రామారావు (ఎఫ్‌ఏసీ) బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన వ్యవసాయ శాఖలో డిప్యూటీ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జిల్లా వ్యవసాయ శాఖ అధికారిగా పనిచేసిన వి.తారకరామారావుకు కాకినాడకు బదిలీ అయింది. జిల్లా వ్యవసాయ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన రామారావుకు వ్యవసాయ శాఖ కార్యాలయం అధికారులు, సిబ్బంది అభినందనలు తెలిపారు.
విజయనగరం గంటస్తంభం: ఎస్‌ఐఆర్ – 2026 ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భా గంగా నోటీసులు జారీ చేసిన 1,93,735 మందికి విచారణ పూర్తి చేసినట్లు డీఆర్వో సిహెచ్.సత్తిబాబు తెలిపారు. బుధవారం తన కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై వివరాలు వెల్లడించారు. సవరించిన షెడ్యూల్ ప్రకారం జూలై 31 ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురించగా, క్లెయిమ్‌లు, అభ్యంతరాల స్వీకరణ గడువు సెప్టెంబరు 10తో ముగిసిందన్నారు. నోటీసుల జారీ, క్లెయిమ్‌లు, అభ్యంతరాల పరిష్కార ప్రక్రియ అక్టోబరు 5 వరకు కొనసాగుతుందని, తుది ఓటర్ల జాబితా అక్టోబరు 9న ప్రచురిస్తా మని తెలిపారు. ఓటర్లు తమ వివరాలను సీఈఓఆంధ్ర.ఎన్‌ఐసి.ఇన్ లేదా జిల్లా అధికారిక వెబ్‌సైట్‌లో పరిశీలించుకోవచ్చన్నారు. సమావేశంలో ఎలక్షన్ సూపరింటెండెంట్ ప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు.
విజయనగరం ఫోర్ట్: ఆస్పత్రికి వచ్చే రోగులతో స్నేహభావంతో మెలగాలని డీసీహెచ్‌ఎస్ డాక్టర్ ఎన్.పి.పద్మశ్రీ రాణి అన్నారు. స్థానిక డీసీహెచ్‌ఎస్ కార్యాలయంలో సెకండరీ హెల్త్ ఆస్పత్రుల సూపరింటెండెంట్‌లతో బుధవా రం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆస్పత్రుల్లో పారిశుధ్యం మరింత మెరు గు పడాల్సిన అవసరం ఉందన్నారు. పారిశు ధ్య నిర్వాహణలో లోపాలున్నట్టయితే సంబంధిత నిర్వాహణ సంస్థకు నోటీస్ ఇచ్చి అపరాధ రుసుం వసూలు చేయాలన్నారు. ఆలస్యంగా విధులకు వస్తున్న వైద్యులకు, సమయం కంటే ముందుగా వెళ్లిపోతున్న వైద్యులకు షోకాజ్ నోటీసులు ఇచ్చి సెలవులు తగ్గించాలన్నారు. అవసరమైన వారికి క్రమశిక్షణ చర్యలకు సిఫా ర్సు చేయాలన్నారు. ఆస్పత్రుల్లో ప్రసవాలు, ఇన్‌పేషేంట్స్ సంఖ్యను పెంచాలన్నారు. ఆస్పత్రికి వస్తున్న ప్రతీ రోగి వివరాలు ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డులో కచ్చితంగా నమోదు చేయాలన్నారు. రోగులకు అవసరమైన మందులు అందుబాటులో ఉండేటట్టు చూడాలన్నారు. రోగు లకు సేవలు అందించడంలో అలసత్వం వహించరాదని సూచించారు.


