తెర్లాం: మరణం కూడా ఆ భార్యాభర్తల బంధాన్ని విడదీయలేకపోయింది. కేవలం రెండు రోజుల వ్యవధిలో భార్యాభర్తలిద్దరూ మృతి చెందిన సంఘటన మండలంలోని ఉద్దవోలు గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని ఉద్దవోలు గ్రామానికి చెందిన తమ్మి రెడ్డి అప్పలస్వామి, పార్వతమ్మ భార్యాభర్తలు. వీరిరువురు గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. సోమవారం అప్పలస్వామి భార్య పార్వతమ్మ(75) అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందింది. మంగళవారం ఆమె అంత్యక్రియలు గ్రామంలో కుటుంబ సభ్యులు నిర్వహించారు. భార్య పార్వతమ్మ మరణించిందన్న దుఃఖంతో భర్త అప్పలస్వామి(79) బుధవారం ఉదయం మృతి చెందా డు. భార్య అంత్యక్రియలు జరిగి 24 గంటలు గడవక ముందే భర్త కూడా మృతి చెందాడు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలముకు న్నాయి. అప్పలస్వామి, పార్వతమ్మలకు ము గ్గురు సంతానం. వారంతా వివాహితులే. తల్లి దండ్రులిద్దరూ ఒక రోజు వ్యవధిలో మరణించ డంతో వారంతా దుఃఖంలో మునిగిపోయారు.


