● ఏపీ రజక సంక్షేమ అభివృద్ధి చైర్‌పర్సన్ సావిత్రి వెల్లడి
విజయనగరం క్రైమ్: ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఆర్థిక సహాయాలు, స్వయం ఉపాధి అవకాశాలను పరిశీలించేందుకు జిల్లాలో పర్యటిస్తున్నట్లు ఏపీ రాష్ట్ర రజక సంక్షేమ, అభివృద్ధి సంక్షేమ కార్పొరేషన్ చైర్‌పర్సన్ సావిత్రి తెలిపారు. ఈ మేరకు జెడ్పీ గెస్ట్‌హౌస్‌లో మంగళవారం ఆమె మాట్లాడుతూ బీసీ కార్పొరేషన్ ద్వారా బీసీలకు ముఖ్యంగా రజకులకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు తాను వచ్చానన్నారు. జిల్లాలో 51 వేల మంది రజకులు ఉన్నారని, బీసీ కార్పొరేషన్ ద్వారా 698లక్షల ఉపాధి లబ్ధిపొందారన్నారు. ఇందులో 429 రజక సొసైటీలుండగా, 147.25లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. రజక మహిళలు శిక్షణ అవకాశాలను వినియోగించుకోవాలని, టైలరింగ్‌తో పాటు జీవనోపాధి శిక్షణ ఇస్తున్నామన్నారు. అందుకు 2849 దరఖాస్తులు రాగా, 2063 మంది అర్హత పొందారని చెప్పారు. అయితే రజక మహిళల నుంచి కేవలం 81 రిజిస్ట్రేషన్‌లు మాత్రమే జరిగాయన్నారు. అవగాహన లోపం కారణంగా రజక మహిళలు ప్రభుత్వ శిక్షణ స్వయం ఉపాఽధి అవకాశాలను వినియోగించుకోలేక పోతున్నారన్నారు. గతంలో త్రీమెన్ కమిషన్ ఏర్పాటు చేసి అందుకు రూ.50లక్షల నిధులు కేటాయిచి మూడు నెలల పాటు కమిషన్ పనిచేసినా ఆ ప్రక్రియ ముందుకు సాగలేదన్నారు.ఇక స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాని రజక సంఘం నేతలు చైర్‌పర్సన్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమస్యలను సీఎం దృష్టికి తీసుకు వెళ్లి ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్కరికి అందేలా చూడడమే తన అంతిమ లక్ష్యమని చైర్‌పర్సన్ స్పష్టం చేశారు.


