పౌష్టికాహారాన్ని అందించడమే లక్ష్యం
పార్వతీపురం: జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలకు, చిన్నారులకు నాణ్యమైన పోషకాహారాన్ని అందించడమే లక్ష్యంగా పని చేయాలని జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్‌కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో అధికారులతో ఆయన శనివారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అంగన్‌వాడీలకు పంపిణీ చేసే బియ్యం, కందిపప్పు, వంటనూనె నాణ్యతా ప్రమాణాలతో ఉండాలని ఎక్కడా నిల్వలు నిలిచిపోకుండా సకాలంలో సరఫరా చేయాలని ఏపీ సివిల్ సప్‌లైస్ కార్పొరేషన్ అధికారులకు సూచించారు. చిన్నారులకు, గర్భిణులకు అందించే పాలు తాజాగా ఉండేలా చూడాలని ఏపీ డెయిరీ ద్వారా సరఫరా ప్రక్రియలో ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలన్నారు. కేంద్రాలకు సరఫరా చేసే కోడిగుడ్ల నాణ్యతను పర్యవేక్షించాలన్నారు. చిన్నారుల శారీరక పెరుగుదలకు అవసరమైన బాలామృతం, పోషకాహార కిట్ల పంపిణీని ఎప్పటికప్పుడు సమీక్షించాలన్నారు. మెనూ ప్రకారం పోషకాహారం అందించేలా అధికారులు పర్యవేక్షణ చేయాలన్నారు. సమీక్షలో ఐసీడీఎస్ పీడీ టి.కనకదుర్గతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
జేసీ యశ్వంత్‌కుమార్ రెడ్డి


