ఆర్టీసీ జోనల్ వర్క్‌షాప్‌ను సందర్శించిన జోనల్ చైర్మన్
విజయనగరం అర్బన్: ఏపీఎస్ ఆర్టీసీ విజయనగరం జోనల్ వర్క్‌షాప్‌ను బుధవారం ఆ సంస్థ జోనల్ చైర్మన్ సయ్యారీ దొన్నుదొర సందర్శించారు. ఇంజిన్, బాడీ, యూనిట్ విభాగాలను పరిశీలించి సిబ్బంది పని తీరును పరిశీలించారు. అక్కడ ఫ్యూరిఫైడ్ వాటర్ సదుపాయాన్ని ప్రారంభించారు. అనంతరం సిబ్బందినుద్దేశించి మాట్లాడుతూ ఆర్టీసీ విజయనగరం జోన్ అన్ని విభాగాల్లో రాష్ట్రంలోనే ముందంజలో ఉండేలా ఉద్యోగులు కృషి చేయాలని కోరారు. కార్మికుల సమస్యల పరిష్కారంలో ముందుంటామన్నారు. జీతాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కార్యక్రమంలో జోనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె.ఎస్.బ్రహ్మానందరెడ్డి, విశాఖ రీజనల్ మేనేజర్ బి.అప్పలనాయుడు, డిప్యూటీ పర్సనల్ మేనేజర్ సుధాబిందు, వర్క్స్ మేనేజర్, స్టోర్స్ అధికారులు, సూపర్వైజర్లు, వర్క్‌షాప్ సిబ్బంది పాల్గొన్నారు.
మహిళలకు రూ.1100 కోట్ల రుణం లక్ష్యం
● డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాస పాణి
నెల్లిమర్ల: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదిగేందుకు రూ.1100 కోట్లు రుణాలు అందజేయాలన్నది లక్ష్యమని డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాస పాణి తెలిపారు. నెల్లిమర్ల మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం వెలుగు వార్షిక కార్యాచరణ ప్రణాళికపై జిల్లా స్థాయి శిక్షణ తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మొదటి విడత 10 మండల సమాఖ్యలను, రెండు, 3, 4 విడతల కింద మూడు మండల సమాఖ్యలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామన్నారు. ఏపీఎం సురేష్ ఆధ్వర్యంలో జరిగిన శిక్షణ కార్యక్రమంలో వెలుగు–డీఆర్‌డీఏ అదనపు పథక సంచాలకులు కె.సావిత్రి , జిల్లా ప్రాజెక్టు మేనేజర్ ఎ.చిరంజీవి, ఏపీఎం విశ్వేశ్వరరావు, సురేష్, పద్మ, 9 మండలాల ఏపీఎంఎంస్ సీసీలు, అకౌంటెంట్లు పాల్గొన్నారు.
సంకిలి చక్కెర కర్మాగారం పరిశీలన
రేగిడి: మండలంలోని సంకిలి వద్ద ఉన్న ఈఐడీ ప్యారీ చక్కెర కర్మాగారాన్ని చీపురుపల్లి ఆర్డీఓ సత్యవేణి బుధవారం పరిశీలించారు. కర్మాగారంలో సల్ఫర్ స్టోరేజ్ లైసెన్స్ రెన్యువల్‌కు యాజమాన్యం దరఖాస్తు చేసుకోవడంతో పరిశీలించినట్టు ఆర్డీఓ తెలిపారు. ఆమె వెంట తహసీల్దార్ ఐ.కృష్ణలత, సిబ్బంది ఉన్నారు.
జిల్లాకు చేరుకున్న
అంచనాల కమిటీ
విజయనగరం అర్బన్: రాష్ట్ర అంచనాల కమిటీ బుధవారం సాయంత్రం విజయనగరం జిల్లాకు చేరుకుంది. కమిటీ చైర్మన్ వి.జోగేశ్వరరావు, సభ్యులు డాక్టర్ పీవీవీ సూర్యనారాయణరాజు (సురేష్‌బాబు), నిమ్మక జయకృష్ణకు జాయింట్ కలెక్టర్ ఎస్.సేతుమాధవన్, డీఆర్వో ఎస్.శ్రీనివాసమూర్తి స్వాగతం పలికారు. జిల్లాలోని పలు అంశాలను వివరించారు. అంతకుముందు కమిటీ ప్రసిద్ధ పర్యాటక కేంద్రం రామనారాయణంను సందర్శించింది. వీరికి అక్కడ ఆర్డీఓ దాట్ల కీర్తి, దేవదాయశాఖ సహాయ కమిషనర్ కె.శిరీష స్వాగతం పలికారు.
ఆర్టీసీ జోనల్ వర్క్‌షాప్‌ను సందర్శించిన జోనల్ చైర్మన్
ఆర్టీసీ జోనల్ వర్క్‌షాప్‌ను సందర్శించిన జోనల్ చైర్మన్
ఆర్టీసీ జోనల్ వర్క్‌షాప్‌ను సందర్శించిన జోనల్ చైర్మన్


