విద్యార్థులకు నవోదయం | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులకు నవోదయం

Nov 27 2025 5:42 AM | Updated on Nov 27 2025 5:42 AM

విద్య

విద్యార్థులకు నవోదయం

విద్యార్థులకు నవోదయం

వీరఘట్టం: గ్రామీణ ప్రాంతంలో ప్రతిభ ఉన్న విద్యార్థులకు అధిక ప్రాధాన్యం ఇస్తూ ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యనందిస్తున్నాయి ఉమ్మడి విజయనగరం,శ్రీకాకుళం జిల్లాల్లోని కిల్తపాలెం, వెన్నెలవలస జవహర్‌ నవోదయ విద్యాలయాలు. సామాన్య, మధ్యతరగతి వర్గాల వారికి ఉన్నత ప్రమాణాలు కలిగిన విద్య దూరమవుతున్న పరిస్ధితుల్లో కార్పొరేట్‌కు దీటుగా ప్రాథమిక స్ధాయి నుంచే విద్యనందిస్తూ విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దుతున్నాయి. నవోదయలో చదివిన విద్యార్థులు ఉన్నత స్థానాలకు చేరుకుంటుండంతో ఇందులో సీటు కోసం ఏటా పోటీ పెరుగుతోంది. ఉపాధ్యాయులు కూడా విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా అర్థవంతమైన బోధన చేస్తూ మెరుగైన ఫలితాలను సాధిస్తున్నారు.

నవోదయ విద్యాలయంలో సీటు వచ్చిందంటే చాలు తమ బిడ్డ భవిత బంగారమేనని తల్లిదండ్రులు భావిస్తున్నారు.ఉమ్మడి జిల్లాల్లో విద్యార్థులకు ఒక్కో జవహర్‌ నవోదయ విద్యాలయంలో 80సీట్లు అందుబాటులో ఉండగా బాలికలకు 30 శాతం సీట్లు, ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7.5 శాతం, దివ్యాంగులకు 3 శాతం సీట్లు కేటాయిస్తున్నారు.అలాగే మొత్తం 80 సీట్లలో 75 శాతం అంటే 60 సీట్లను గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కేటాయిస్తారు. అయితే 2026–27 విద్యాసంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశానికి ఉమ్మడి విజయనగరం జిల్లాలో 7200 మంది, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 7936 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.

పరీక్ష విధానం

నవోదయ ప్రవేశ పరీక్ష 100 మార్కులకు 80 ప్రశ్నలు ఉంటాయి.రెండు గంటల పాటు పరీక్ష నిర్వహిస్తారు.దివ్యాంగులకు అదనంగా మరో 40 నిమిషాల సమయం ఇస్తారు.

అత్యుత్తమ విద్యా ప్రమాణాలు..

నవోదయ విద్యాలయంలో సీబీఎస్‌ఈ సిలబస్‌తో అత్యుత్తమ విద్యాబోధన అందిస్తారు. సువిశాలమైన ప్రాంగణం, ఆహ్లాదకర వాతావరణం, ఒత్తిడి లేని విద్య, విద్యార్థి కేంద్రీకత అత్యుత్తమ విద్యాబోధన, ఆధునాతన కంప్యూటర్‌ ల్యాబ్‌, పోషక విలువలతో కూడిన ఆహారం, మానసికోల్లాసానికి క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, యోగా, ఎన్‌సీసీ, తదితర అంశాలను బోధిస్తున్నారు. నిపుణులైన అధ్యాపకులు ఉండడంతో సీబీఎస్‌ఈ పరీక్ష ఫలితాల్లో వందశాతం ఉత్తీర్ణత సాధిస్తూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులకు డిజిటల్‌ క్లాస్‌రూమ్స్‌లో నిపుణులైన అధ్యాపకులతో విద్యాబోధన అందిస్తున్నారు.

అంతా ఉచితమే..

నవోదయ విద్యాలయంలో ప్రవేశం పొందిన విద్యార్థులకు అన్ని సౌకర్యాలు ఉచితమే. 6 నుంచి ఇంటర్మీడియట్‌ వరకు అత్యుత్తమ విద్యను అందిస్తారు. విద్యార్థుల భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఆరోగ్య పర్యవేక్షణ కోసం స్టాఫ్‌నర్సులు అందుబాటులో ఉంటారు.

ఎంఈఓ కార్యాలయాల్లో హాల్‌ టికెట్లు..

ఉమ్మడి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వచ్చే నెల డిసెంబర్‌ 13న ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు నవోదయ ప్రవేశ పరీక్ష జరగనుంది. ఉమ్మడి విజయనగరం జిల్లాలో 42,ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 32 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. హాల్‌ టికెట్లను విద్యార్థులకు అందుబాటులో ఉంచేందుకుగాను అన్ని మండల కేంద్రాల్లో ఉన్న ఎంఈఓ కార్యాలయాలకు పీడీఎఫ్‌లో పంపించారు.లేదా జవహర్‌ నవోదయ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.

పరీక్షకు ముమ్మర ఏర్పాట్లు

విజయనగరం,పార్వతీపురం మన్యం జిల్లాల్లో డిసెంబర్‌ 13న జవహర్‌ నవోదయ ప్రవేశ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశా. ఆయా జిల్లాల విద్యాశాఖాధికారుల పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహిస్తాం. ఇందుకు సంబంధించి ఇప్పటికే రెండు జిల్లాల విద్యాశాఖాధికారులతో మాట్లాడాం. హాల్‌ టికెట్లు ఎంఈఓల వాట్సాప్‌కు పంపించాం.అక్కడి నుంచి ప్రధానోపాధ్యాయులు ద్వారా హాల్‌టికెట్లు పొందవచ్చు.

ఆరవ తరగతిలో సీటు సాధిస్తే

ఇంటర్‌ వరకు ఉచిత విద్యాబోధన

డిసెంబర్‌ 13న ప్రవేశపరీక్ష

ఉమ్మడి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు

విద్యార్థులకు నవోదయం1
1/4

విద్యార్థులకు నవోదయం

విద్యార్థులకు నవోదయం2
2/4

విద్యార్థులకు నవోదయం

విద్యార్థులకు నవోదయం3
3/4

విద్యార్థులకు నవోదయం

విద్యార్థులకు నవోదయం4
4/4

విద్యార్థులకు నవోదయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement