గజపతినగరంలో రోడ్డు ప్రమాదం
● కారు దిగిన కలెక్టర్
గజపతినగరం: మోంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల పర్యటనలో ఉన్న విజయనగరం కలెక్టర్ ఎస్.రామ్‌సుందర్ రెడ్డి గజపతినగరం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదాన్ని బుధవారం గమనించారు. వెంటనే ఆయన ప్రయాణించే వాహనాన్ని నిలిపి కిందికి దిగి గాయపడిన వ్యక్తులకు ధైర్యం చెప్పారు.అనంతరం అంబులెన్స్ ఏర్పాటు చేయించి బాధితులను ఆస్పత్రికి తరలించి మానవత్వం చాటుకున్నారు. గోల్డెన్ అవర్‌లో అందించిన సాయం మనిషి ప్రాణాలను కాపాడుతుందని ప్రాణం కంటే విలువయినది ఏమీ లేదని కలెక్టర్ ఈ సందర్భంగా అన్నారు.
గుర్ల: మండలంలోని తాతావారి కిట్టాలి వద్దనున్న గడిగెడ్డ రిజర్వాయర్‌లో మెరకముడిదాం మండలంలోని గర్భాం గ్రామానికి చెందిన పల్లేడ రవీంద్ర అనే యువకుడు బుధవారం స్నానానికి దిగాడు. స్నానం చేస్తుండగా ఫోన్‌లో సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించగా అప్పటికే నీటి ప్రవాహం పెరగడంతో రవీంద్ర కొట్టుకుపోతున్నాడు. రిజర్వాయర్‌లో కొట్టుకుపోతున్న రవీంద్రను స్థానికుడు సీల సూర్యనారాయణ గమనించి ఒడ్డుకు చేర్చాడు. దీంతో స్థానికులు, అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. రవీంద్ర లవిడాంలోని తన సహచర కుటుంబ సభ్యుల ఇంటికి వచ్చి రిజర్వాయర్‌కు స్నానానికి వచ్చినట్లు చెప్పాడు.
పురుగు మందు తాగి వ్యక్తి ఆత్మహత్య
వంగర: మండల పరిధి అరసాడ గ్రామానికి చెందిన కడగల రాము(49) పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై వంగర పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నిత్యం మద్యం తాగడంతో కడుపునొప్పి తాళలేక ఈ నెల 26వ తేదీన మద్యంలో కలిపి పురుగులు మందు తాగేశాడు. కుటుంబసభ్యులు గమనించి రాజాం సీహెచ్‌సీకి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. భార్య కడగల శ్రీదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై ప్రసాద్ తెలిపారు. మృతుడికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలున్నారు.
గజపతినగరంలో రోడ్డు ప్రమాదం


