పోలీస్ సిబ్బంది రక్తదాన శిబిరం
విజయనగరం: పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా స్థానిక పోలీస్ ట్రైనింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని కళాశాల ప్రిన్సిపాల్ డి.రామచంద్రరాజు సోమవారం ప్రారంబించారు. పీటీసీ ఏర్పాటు చేసిన ఈ రర్తదాన శిబిరంలో కళాశాల సిబ్బంది రక్తం ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ రామచంద్రరాజు మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల ప్రాణ త్యాగాలను స్మరించుకుంటూ వారోత్సవాలను జరుపుకుంటున్నామన్నారు. పోలీసులంటే సేవకు, త్యాగానికి ప్రతీక అని తెలియజేస్తూ రక్తదానం కూడా ఆ సేవలో అతి ముఖ్యమైన భాగమని దీని ద్వారా కొందరి ప్రాణాలను కాపాడగలమని ప్రిన్సిపాల్ అన్నారు. ఎన్వీఎన్ బ్లడ్ బ్యాంక్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో కళాశాలలో శిక్షకులకు తర్ఫీదు ఇస్తున్న డి.శంకర్, కె.శ్రీరాములు, కె.మురళీమోహన్, జి.మురళి, ఆర్‌ఐలు, ఆర్.వాసుదేవ్, డి.విజయకూమార్, కె.హేమంత్ కూమార్, ఎస్సైలు బి.దివాకర్, కె.రమేష్, సీహెచ్ సత్తిబాబు, ముగ్గురు హోంగార్డ్స్ తమ రక్తాన్ని ఇచ్చారు.


