మోంథా ముప్పు..! | - | Sakshi
Sakshi News home page

మోంథా ముప్పు..!

Oct 28 2025 7:22 AM | Updated on Oct 28 2025 8:20 AM

పూసపాటిరేగ/భోగాపురం:

మోంథా తుఫాన్‌ ప్రభావంతో జిల్లాలో వర్షాలు జోరందుకున్నాయి. కొన్నిచోట్ల గాలులు వీయడంతో వరిచేలు నేలకొరిగాయి. నూర్పిడిచేసిన మొక్కజొన్న, అమ్మకానికి సిద్ధంచేసిన పత్తి పంటలను రక్షించుకునేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. రోడ్లు, కల్లాల్లో రాశులుగా పోసి టార్పాలిన్లు కప్పుతున్నారు. తుఫాన్‌ హెచ్చరికల నేపథ్యంలో పలు రైళ్లను ఆ శాఖ అధికారులు రద్దుచేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పూసపాటిరేగ, భోగాపురం తీరంలోని సముద్రంలో అల్లకల్లోలంగా మారింది. అలలు ఎగసిపడుతున్నాయి. తీరప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. చింతపల్లి రేవులో 20 మీటర్ల వరకు సముద్రం ముందుకు వచ్చింది. తీరం ఒడ్డున ఉన్న వలలు, బోట్లను ట్రాక్టర్ల సహాయంతో మత్స్యకారులు సురక్షిత ప్రాంతానికి తరలించారు. చింతపల్లిలో తీరంలో గెడ్డ వద్ద సముద్రం కోతకు గురయింది. తిప్పలవలస, తమ్మయ్యపాలెం గ్రామాలను అలలు తాకుతున్నాయి. కలెక్టర్‌ రాంసుందర్‌రెడ్డి, ఎస్పీ దామోధర్‌తో పాటు పలువురు అధికారులు తీరప్రాంతంలో పర్యటించి ప్రజలను అప్రమత్తం చేశారు.

విజయనగరం టౌన్‌: మొంథా తుఫాన్‌ ఎఫెక్ట్‌ రైల్వేశాఖపై పడింది. ప్రయాణికుల భద్రత నేపథ్యంలో ఈ నెల 27, 28, 29 తేదీల్లో పలు రైళ్లను రద్దుచేసి, మరికొన్నింటిని దారిమళ్లించినట్లు ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే సోమవారం ప్రకటించింది. ప్రయాణికులకు తక్షణ సమాచారం కోసం ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే డివిజన్‌ పరిధిలో విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, రాయగడ తదితర రైల్వేస్టేషన్‌లలో హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటుచేసింది.

రద్దయిన రైళ్ల వివరాలు..

రైలు నంబర్‌ 18515/516 విశాఖ–కిరండోల్‌ ఎక్స్‌ప్రెస్‌తో పాటు 58501/502 కిరండోల్‌–విశాఖ ప్యాసింజర్‌ను రద్దుచేసింది. 58538/537 విశాఖ–కోరాపుట్‌–విశాఖ, 18512/511 విశాఖ–కోరాపుట్‌–విశాఖ ఎక్స్‌ప్రెస్‌, 18526/525 విశాఖ–బరంపురం–విశాఖ ఎక్స్‌ప్రెస్‌, 67289/290 విశాఖ–పలాస మెమూ–విశాఖ, 67287/288 విశాఖ–విజయనగరం–విశాఖ మెమూ, 68433/434 కటక్‌–గుణుపూర్‌–కటక్‌ మెమూ, 58531/532 బరంపురం–విశాఖ–బరంపురం ప్యాసింజర్‌, 58506/505 విశాఖ–గుణుపూర్‌–విశాఖ ప్యాసింజర్‌, 18463 భువనేశ్వర్‌–కెఎస్‌ఆర్‌ బెంగుళూర్‌ ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌, 17015 భువనేశ్వర్‌–సికింద్రాబాద్‌ విశాఖ ఎక్స్‌ప్రెస్‌, 20851 భువనేశ్వర్‌–పుదుచ్చేరి వీక్లీను ఈ నెల 28న రద్దుచేశారు. రైలు నంబర్‌ 18189 టాటానగర్‌, ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్‌ను టిట్లాఘర్‌, రాయ

మోంథా ఎఫెక్ట్‌

జిల్లాలో వర్షాల జోరు

చింతపల్లి తీరంలో 20 అడుగులు

ముందుకొచ్చిన సంద్రం

వలలు, బోట్లను సురక్షిత ప్రాంతాలకు తరలించిన మత్స్యకారులు

ప్రాజెక్టుల వద్ద అప్రమత్తం

పలు రైళ్ల రద్దు

సముద్ర, నదీతీర గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు

తీర గ్రామాల్లో పర్యటించిన కలెక్టర్‌, ఎస్పీ

పూర్‌, నాగపూర్‌, బల్లార్ష మీదుగా డైవర్ట్‌ చేశారు. 18447 భువనేశ్వర్‌–జగదల్‌పూర్‌ హీరాఖండ్‌ రాయగడ వరకు, 18107 రూర్కెల్లా–జగదల్‌పూర్‌ ఇంటర్‌ సిటీ ఎక్స్‌ప్రెస్‌ను రాయగడ వద్ద షార్ట్‌ టెర్మినేట్‌ చేశారు. ప్రయాణికులు తుఫాన్‌ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, రైళ్ల రాకపోకల వివరాలను ఎప్పటికప్పుడు హెల్ప్‌డెస్క్‌ల ద్వారా తెలుసుకోవచ్చని అధికారులు కోరారు.

నదిలోకి మడ్డువల నీరు

వంగర: మండల పరిధి మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్టు వద్ద సోమవారం రాత్రి 7 గంటల సమయంలో 63.72 మీటర్ల మేర నీటిమట్టం నమోదైంది. తుఫాన్‌ వర్షాలకు వేగావతి, సువర్ణముఖి నదుల నుంచి 4 వేల క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులో చేరుతుండగా ఒక గేటు ఎత్తి వరద నీటిని దిగువకు విడిచిపెడుతున్నామని ఏఈ నితిన్‌ తెలిపారు.

మోంథా ముప్పు..! 1
1/3

మోంథా ముప్పు..!

మోంథా ముప్పు..! 2
2/3

మోంథా ముప్పు..!

మోంథా ముప్పు..! 3
3/3

మోంథా ముప్పు..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement