గుండెపోటుతో లైబ్రేరియన్ మృతి
● సంతాపం తెలియజేసిన గురుకులాల జిల్లా కో ఆర్డినేటర్
సీతానగరం: మండలంలోని జోగింపేట డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయం లైబ్రేరియన్ కేతిరెడ్డి రామలక్ష్మి(53)గుండెపోటుకు గురై మృతి చెందడం దురదృష్టకరమని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల జిల్లా కో ఆర్డినేటర్ మాణిక్యమ్మ అన్నారు. అంబేడ్కర్ గురుకుల విద్యాలయంలో విధులు నిర్వహిస్తుండగా గుండెపోటుకు గురైన కేతిరెడ్డి రామలక్ష్మి కుప్పకూలిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోవడంతో చికిత్స నిమిత్తం పార్వతీపురం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. లైబ్రేరియన్ రామలక్ష్మి విద్యాలయంలో అస్తస్థతకు గురై విధి నిర్వహణలో కుప్పకూలిపోయినట్లు తెలియగానే వచ్చిన జిల్లా కోఆర్డినేటర్ మాణిక్యమ్మ ప్రిన్సిపాల్ రాజారావు తక్షణం ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. రామలక్ష్మి మృతదేహానికి స్వగ్రామం బక్కుపేటలో ఆదివారం ఉదయం అంత్యక్రియలు నిర్వహించారు. కేతిరెడ్డి రామలక్ష్మి, రామకృష్ణ దంపతులకు ఇద్దరు కుమారులు కాగా పెద్దకుమారుడు గుర్గాంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తుండగా చిన్నకుమారుడు నాగ్‌పూర్ ఎన్‌ఐటీలో నాలుగవ సంవత్సరం చదువున్నాడు.
గుండెపోటుతో లైబ్రేరియన్ మృతి


