అండర్–15 చెస్ పోటీలకు స్పందన
విజయనగరం: చెస్ అసోసియేషన్ ఆఫ్ విజయనగరం ఆధ్వర్యంలో పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న 15 సంవత్సరాలలోపు వయస్సు గల విద్యార్థులకు ఆదివారం నిర్వహించిన రోలింగ్ ట్రోఫీ చెస్ పోటీలకు స్పందన లభించింది. నగరంలోని రింగ్‌రోడ్‌లో గల ఫైర్‌చెస్ స్కూల్‌లో నిర్వహించిన ఎంపిక పోటీలకు జిల్లా నలుమూలల నుంచి 50 మంది క్రీడాకారులు హాజరుకాగా ..డాక్టర్ బీసెంట్ స్కూల్ విద్యార్థి ఎ.పరమేష్ ప్రథమ బహుమతి, గురజాడ పబ్లిక్ స్కూల్ విద్యార్థి అనురాగ్ విశ్వాస్ కె. ద్వితీయ బహుమతి, కేంద్రియ విద్యాలయ విద్యార్థులు ఎ.జిగ్నేష్, శ్రీమన్నారాయణ సాహు, కె. సోమనాథ్ 3,4,5వ బహుమతులు గెలుచుకున్నారు. ఈ టోర్నమెంట్‌కు కేవీ జ్వాలాముఖి న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. అదేవిధంగా దేశంలోనే మొట్టమొదటిసారిగా విజయనగరంలో నిర్వహించిన చెస్ థియరీ పరీక్షలో సుమారు 45 మంది విద్యార్థులు వివిధ పాఠశాలల నుంచి పాల్గొన్నారు. పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు త్వరలో సర్టిఫికెట్‌లు ప్రదానం చేయనున్నట్లు చెస్ అసోసియేషన్ ఆఫ్ విజయనగరం జిల్లా అధ్యక్షుడు కేకే జగన్నాథ్, కార్యదర్శి కరణం భాస్కరరావులు తెలిపారు.


