జాతీయ స్థాయి పోటీల్లో రాణించాలి
● కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి
● రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీల
విజేతలకు బహుమతులు ప్రదానం
విజయనగరం: జాతీయ స్థాయి తైక్వాండో పోటీల్లో రాణించాలని విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్, వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి కోలగట్ల శ్రావణి ఆకాంక్షించారు. జిల్లా కేంద్రంలోని రాజీవ్ క్రీడామైదానంలో రెండు రోజుల పాటు నిర్వహించిన 42వ రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల ముగింపు కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విజయనగరం జిల్లా కేంద్రంలో రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో రాణించాలని ఆకాంక్షించారు. క్రీడలు ఆత్మస్థైర్యానికి, ఆత్మవిశ్వాసానికి దోహదపడతాయని చెప్పారు. రాష్ట్రస్థాయి క్రీడలను విజయవంతంగా నిర్వహించిన జిల్లా తైక్వాండో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు డీవీ చారిప్రసాద్, ఇతర కార్యవర్గాన్ని ఈ సందర్భంగా ఆమె అభినందించారు. అనంతరం విజేతలకు మెడల్స్ ప్రదానం చేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి సుంకరి సతీష్, కమిటీ సభ్యులు కె.రాంబాబు, బుగత శ్రీనివాసరావు, సీనియర్ తైక్వాండో మాస్టర్ రవి గన్, జాతీయ తైక్వాండో అసోసియేషన్ పరిశీలకుడు ఫరీద్, ఏపీటీఏ ఉపాధ్యక్షుడు శ్రీను, జాయింట్ సెక్రెటరీ ఎస్. గురుస్వామి, జనరల్ సెక్రెటరీ ఎల్‌టీ చంద్రమౌళి, ఆర్. దాలిరాజు, తదితరులు పాల్గొన్నారు.


