విద్యార్థుల మరణాలకు మంత్రి బాధ్యత వహించాలి
సాలూరు రూరల్: ఏజెన్సీ ప్రాంతంలో చోటుచేసుకుంటున్న గిరిజన విద్యార్థుల మరణాలకు గిరిజన శాఖా మంత్రి గుమ్మడి సంధ్యారాణి బాధ్యత వహించాలని మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర డిమాండ్ చేశారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల మరణాలు ఆగటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. బాధ్యతగా వ్యవహరించాల్సిన స్థానిక మంత్రి సంధ్యారాణి నిర్లక్ష్యంగా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. జ్వరాలు వస్తే నాకేం బాధ్యతంటూ వ్యంగ్యంగా సమాధానం చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. సీతంపేట ఐటీడీఏ పరిధిలో హడ్డుబంగి గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న మండలంగి కవిత జ్వరంతో చనిపోవడం బాధాకరమన్నారు. ఇప్పటికే 15 మంది విద్యార్థులు చనిపోయారని.. దీనిపై బాధ్యత వహించాల్సిన గిరిజన శాఖా మంత్రి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని.. ఈ వ్యవహారంపై విద్యాశాఖా మంత్రి నారా లోకేష్ దృష్టి సారించాలని కోరారు.
మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర


