ఆనందమానందమాయె..!
విజయనగరం ఫోర్ట్:
జిల్లా ప్రజలతో పాటు పేద, మధ్యతరగతి కుటుంబాల వైద్య విద్యార్థులకు శుభవార్త ఇది. గత జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ కృషికి తార్కాణం. మూడేళ్ల కిందట జిల్లాలో ప్రభుత్వ వైద్యకళాశాల ఏర్పాటుతో ఓ వైపు ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందుబాటులోకి రావడంతో పాటు పేద కుటుంబాల విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించేందుకు అవకాశం లభించింది. తాజాగా కళాశాలకు 12 పీజీ సీట్లు మంజూరు చేస్తూ ఎన్‌ఎంసీ (నేషనల్ మెడికల్ కమిషన్) ఉత్తర్వులు జారీచేసింది. దీంతో ఓ వైపు విద్యార్థిలోకం సంబరపడుతుండగా, మరోవైపు మరింత మెరుగైన వైద్యసేవలు అందుతాయని జిల్లా ప్రజలు సంతోషపడుతున్నారు. గత ప్రభుత్వం కృషి, ముందుచూపును కొనియాడుతున్నారు. పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన విద్యార్థులకు వైద్య విద్య, ప్రజలకు వైద్యసేవలు చేరువ చేయాలనే గొప్ప సంకల్పంతో మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌హహన్ రెడ్డి అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా 17 వైద్య కళాశాలలకు ఏర్పాటుకు శ్రీకారం చుట్టడం, ఐదు కళాశాలలు నిర్మించి తరగతులు ప్రారంభించడాన్ని గుర్తుచేసుకుంటున్నారు.
దుష్ప్రచారానికి చెంపపెట్టు
ప్రభుత్వ వైద్య కళాశాలలపై కూటమి నేతలు దుష్ప్రచారం చేశారు. వైద్య కళాశాలలు నిర్మాణం జరగలేదని, అక్కడ గోతులు, తుప్పలు ఉన్నాయని, తరగతులు జరగడం లేదని రకరకాలుగా ఆరోపణలు చేశారు. ప్రైవేటీకరణకు పూనుకున్నారు. ఇప్పుడు ఎన్‌ఎంసీ ప్రభుత్వ వైద్య కళాశాలలకు పీజీ సీట్లు మంజూరు చేయడంతో కూటమి నేతల నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్టు అయింది. జగన్ మోహన్ రెడ్డి వైద్య కళాశాలలు నిర్మించడం వల్లే ఎన్‌ఎంసీ పీజీ సీట్లు మంజూరు చేసిందనే చర్చ జోరందుకుంది. కూటమి నేతల చేసినది అంతా బూటకపు ప్రచారం అని తేలిపోయింది. వైద్య కళాశాలలు నిర్మించడం వల్ల వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి మంచి పేరు వస్తుందనే దుర్భుద్ధితోనే కూటమి సర్కారు దుష్ప్రచారానికి తెరలేపిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
150 మందికి విద్యావకాశం
విజయనగరం ప్రభుత్వ వైద్య కళాశాలలో 150 మంది వైద్య విద్యార్థులు ఏటా వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. గత మూడేళ్లుగా ఏడాదికి 150 మందికి ప్రవేశాలు లభిస్తున్నాయి. ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు వల్ల సామాన్య, మధ్యతరగతి విద్యార్థులకు వైద్యవిద్య అక్కరకు వచ్చింది. డాక్టర్ కావాలన్న ఆశం నెరవేరుతోంది. పీజీ సీట్లు మంజూరుతో స్థానికంగానే వైద్యవిద్యలో మాస్టర్ చేసే అవకాశం లభిస్తుంది.
శుభపరిణామం
ఇక్కడి ప్రభుత్వ వైద్య కళాశాలకు 12 పీజీ సీట్లు మంజూరయ్యాయి. జనరల్ సర్జరీ విభాగానికి 4, జనరల్ మెడిసిన్‌కు 4, గైనిక్‌కు 4 చొప్పున పీజీ సీట్లు మంజూరయ్యాయి. పీజీ సీట్లు మంజూరు కావడం శుభపరిణామం. విద్యార్థులకు చక్కని అవకాశం. – డాక్టర్ దేవీమాధవి,
ప్రిన్సిపాల్, ప్రభుత్వ వైద్య కళాశాల
ఆనందంగా ఉంది
మా కళాశాలకు పీజీ సీట్లు రావడం చాలా ఆనందంగా ఉంది. విజయనగరంలో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుతో సీట్లు లభించాయి. వైద్యవిద్యను అభ్యసించగలుగుతున్నాం. కళాశాలకు పీజీ సీట్లు రావడంతో పీజీ విద్యను సైతం ఇక్కడే చదువుకునే అవకాశం ఉంటుంది.
– హరీష్, వైద్య విద్యార్థి, ప్రభుత్వ వైద్య కళాశాల
ఇదో మంచి అవకాశం
వైద్య కళాశాల ఏర్పాటు కావడం పెద్ద అవకాశం. పీజీ సీట్లు రావడం మరింత సదావకాశం. వైద్య కళాశాలకు ఎన్‌ఎంసీ పీజీ సీట్లు కేటాయించడం గొప్ప విషయం. ఎంబీబీఎస్‌తో పాటు పీజీ వైద్యవిద్యను ఇక్కడే చదువుకోవచ్చు.
– శరత్ సింగ్, వైద్య విద్యార్థి,
ప్రభుత్వ వైద్య కళాశాల
అందుబాటులోకి పీజీ వైద్యవిద్య
ఫలించిన గత ప్రభుత్వ ముందుచూపు
గత సీఎం జగన్ వల్ల వైద్యకళాశాల నిర్మాణంతో పాటు తరగతులు
ప్రారంభం
నేడు 12 పీజీసీట్లు మంజూరు చేసిన
ఎన్‌ఎంసీ
ఆనందమానందమాయె..!
ఆనందమానందమాయె..!
ఆనందమానందమాయె..!


