● ఫ్రీ బస్సు పాట్లు..!
ఏ బస్సు చూసినా ఏముంది గర్వకారణం.. కిక్కిరిసిన ప్రయాణమే అన్నట్టుగా ఉంది ప్రస్తుతం విజయనగరం జిల్లాలో బస్సు సర్వీసుల పరిస్థితి. చాలా రూట్లలో ప్రయాణికులకు సరిపడా బస్సులు లేకపోవడం సమస్యగా మారింది. గమ్యస్థానాలకు చేరుకోవాలన్న ఆతృతలో ఫుట్‌బోర్డులపై ప్రమాదకర ప్రయాణాలు సాగిస్తున్నారు. గతంలో యువకులు, విద్యార్థులు మాత్రమే ఫుట్‌బోర్డులపై ప్రయాణిస్తూ కనిపించేవారు. ఇప్పుడు ఉచిత బస్సు సదుపాయంతో మహిళలు కూడా ఆ కోవలోకి చేరారు. దీనికి కోట కూడలిలో శనివారం కనిపించిన ఈ చిత్రమే సజీవ సాక్ష్యం. – సాక్షిఫొటోగ్రాఫర్, విజయనగరం


