మన్యంపై జ్వరాల పంజా
సాక్షి, పార్వతీపురం మన్యం: మన్యంపై సీజనల్ వ్యాధులు పంజా విసురుతున్నాయి. జ్వరాలు, కామెర్ల బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. మలేరియాతో బాధపడుతూ ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య అధికమవుతోంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు అందుబాటులో లేకపోవడంతో.. సీహెచ్‌సీలు, జిల్లా ఆస్పత్రికి రిఫరల్స్ అధికమవుతున్నాయి. ప్రధానంగా జిల్లా ఆస్పత్రిలో వార్డులు జ్వరపీడితులతో నిండిపోతున్నాయి. వీరిలో వివిధ ఆశ్ర మ పాఠశాలలు, వసతిగృహాల నుంచి వస్తున్న పిల్లలే ఎక్కువగా ఉండడం గమనార్హం. సాలూ రు సీహెచ్‌సీలో 21 మందికిపైగా విద్యార్థులు చికిత్స పొందుతున్నారు. వీరిలో పచ్చకామెర్లు, మలేరియా, ఇతర అనారోగ్య సమస్యలతో ఉన్న వారు ఉన్నారు. జిల్లా ఆస్పత్రిలో కురు పాం ఆశ్రమ, ఏకలవ్య పాఠశాల విద్యార్థులు చికిత్స పొందుతున్నారు.


