వాస్తవాలను వెలుగులోకి తెచ్చే పత్రికలపై కూటమి ప్రభుత్వ అ
రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు
జర్నలిస్టులు, ఎడిటర్‌లపై కక్ష సాధింపులపై ఉపేక్షించేది లేదు. ప్రభుత్వాలు చేసే పొర పాట్లను వివరించి ప్రజలకు కలిగే కష్టనష్టాలను, జాగ్రత్తలు సూచించడం పత్రికల బాధ్యత. అ క్రమంలో పత్రికలు రాసే వార్తలను వేరే భావనతో చూసి ఆ సంస్థపై వేధింపులకు దిగడం దారుణం. ప్రభు త్వ వైఫల్యాలను ప్రజల పక్షాన వినిపిస్తున్న సాక్షి మీడియాపై కూటమి ప్రభుత్వ అణచివేత ధోర ణిని ఖండిస్తున్నాం. కక్ష సాధింపు చర్యలు మానకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు తప్పవు. – మహా పాత్రో,
జిల్లా అధ్యక్షుడు, ఎపీయూడబ్ల్యూజే
పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు వేస్తారా
జర్నలిస్టులపై కేసుల పేరిట వేధింపులకు పాల్పడడం రాష్ట్రంలో గత కొద్ది కాలంగా కొనసాగుతోంది. ఇది బాధాకరం. నకిలీ మద్యం తయారీ మీద సాక్షి పలు కథనాలను ప్రచురిస్తోంది. అందులో ఏమైనా తప్పులుంటే ఖండించాలే తప్ప కేసులు బనాయించడం అంటే పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు వేయడం కిందే లెక్క.
– వీఎంఎల్‌కే లక్ష్మణరావు,
సీనియర్ జర్నలిస్టు
అప్రజాస్వామికం
రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛ ప్రమాదంలో పడింది. ప్రజా సమస్యలను పత్రికలు వెలుగులోకి తీసుకొని రావడాన్ని పాలకులు సహించలేకపోతున్నారు. కేవలం కొంతమందిని లక్ష్యంగా చేసుకొని కేసులు పెట్టి వేధింపులకు గురిచేస్తున్నారు. ప్రజా సమస్యలను పత్రికల ద్వారా ప్రభుత్వానికి చేరవేసే జర్నలిస్టులపై అక్రమ కేసులు పెట్టడం హేయమైన చర్య. సాక్షాత్తు ఎడిటర్ మీద కేసులు పెట్టడం, నోటీసులతో కార్యాలయానికి వెళ్లి హడావిడి చేయడం ప్రజాస్వామ్యానికి హితం కాదు.
– వీఎస్‌ఎన్ కుమార్, రాష్ట్ర చైర్మన్, ఇంటర్నేషనల్ హ్యూమన్‌రైట్స్ అసోసియేషన్
పత్రికా స్వేచ్ఛపై దాడి సమంజసం కాదు
ప్రజాస్వామ్య పరిపుష్టికి పత్రికలదే ప్రధాన పాత్ర. ప్రభుత్వానికో, వ్యక్తులకో వ్యతిరేకంగా వార్తలు వస్తున్నాయని సాక్షి పత్రికపై దాడి చేయడం ఏవిధంగాను సమర్ధనీయం కాదు. ఒకవేళ వార్తలు వ్యతిరేకంగా వస్తే నిజాలతో న్యాయబద్ధంగా పోరాడాలే తప్ప కేసులు పెట్టడం తగదు. ఈ రోజు సాక్షి.. రేపు మరొకటి.. ఇలా పత్రికలపై కక్ష సాధింపు చర్యలు చేపడుతూ ఉంటే పత్రికా స్వేచ్ఛ ఎక్కడ?. ఇలాంటి చర్యలు ఆమోదయోగ్యం కాదు.
– జేసీ రాజు, ఫ్యాప్టో రాష్ట్ర నాయకుడు
వాస్తవాలను వెలుగులోకి తెచ్చే పత్రికలపై కూటమి ప్రభుత్వ అ
వాస్తవాలను వెలుగులోకి తెచ్చే పత్రికలపై కూటమి ప్రభుత్వ అ
వాస్తవాలను వెలుగులోకి తెచ్చే పత్రికలపై కూటమి ప్రభుత్వ అ
వాస్తవాలను వెలుగులోకి తెచ్చే పత్రికలపై కూటమి ప్రభుత్వ అ


