హోంగార్డు కుటుంబానికి ‘చేయూత’
విజయనగరం క్రైమ్: ఉద్యోగ విరమణ చేసిన హోంగార్డు కె.సూర్యనారాయణకు ‘చేయూత‘ కింద రూ.3,18,790ల చెక్కు, కో ఆపరేటివ్ నుంచి రూ.32,017ల చెక్కును జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ శుక్రవారం అందజేశారు. జిల్లా పోలీస్ శాఖలో పనిచేస్తూ ప్రమాదవశాత్తు, అనారోగ్యంతో మృతి చెందిన, ఉద్యోగ విరమణ చేసిన హోంగార్డు కుటుంబాలను ఆర్థికంగా ఆదుకునేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్న హోంగార్డులను అభినందించారు.
కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, డీపీఓ ఏఓ పి.శ్రీనివాసరావు, హోంగార్‌ుడ్స ఇన్‌చార్జి ఆర్‌ఐ ఆర్.రమేష్ కుమార్, ఆఫీస్ సూపరింటెండెంట్ టి.రామకృష్ణ, కో ఆపరేటివ్ డైరెక్టర్ సుశీల పాల్గొన్నారు.


