పైడితల్లి వనంగుడి హుండీల ఆదాయం లెక్కింపు
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్యదైవం పైడితల్లి అమ్మవారి వనంగుడి హుండీల ఆదాయాన్ని రైల్వేస్టేషన్ వద్ద ఉన్న అమ్మవారి ఆలయ ఆవరణలో గురువారం లెక్కించారు. 42 రోజులకు రూ.12లక్షల 52వేల 606 నగదు లభించినట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి కె.శిరీష తెలిపారు. రామతీర్థం ఈఓ వై.శ్రీనివాసరావు పర్యవేక్షణలో సాగిన ఆదాయం లెక్కింపులో ధర్మకర్తల మండలి సభ్యులు పద్మావతి, కుమారి, తామేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు
విజయనగరం టౌన్: మహాకవి గురజాడ వర్ధంతిని పురస్కరించుకుని జిల్లాస్థాయిలో ఉన్నత పాఠశాలల విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహిస్తామని సమాఖ్య ప్రధాన కార్యదర్శి కాపుగంటి ప్రకాష్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 30న ఉదయం 9.30 గంటల నుంచి గురజాడ జిల్లా కేంద్ర గ్రంథాలయం ఆవరణలో పోటీలు నిర్వహిస్తామన్నారు. వక్తృత్వ పోటీల్లో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన వారికి నవంబర్ 30న సాహితీవేత్తలతో నిర్వహించే సభలో మాట్లాడే అద్భుతమైన అవకాశం కల్పిస్తామని పేర్కొన్నారు. వివరాలకు సెల్: 83744 49526, 75693 51363, 94401 17116 నంబర్లను సంప్రదించాలని కోరారు.
దైవానుగ్రహంతోనే లోక కల్యాణం
బొబ్బిలి: దైవానుగ్రహంతోనే లోక కల్యాణం సాధ్యమని త్రిదండి అష్టాక్షరీ సంపత్కుమార రామానుజ జియర్, బృందావన రామానుజ జియర్‌లు అన్నారు. బొబ్బిలి కంచర వీధిలోని కల్యాణవేంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులకు ప్రవచనాలు, మంగళా శాసనాలు అందజేశారు. కార్యక్రమంలో స్థానిక పురోహితులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఉపాధి కోర్సుల్లో ఉచిత శిక్షణ
● ఈ నెల 18లోగా దరఖాస్తుల స్వీకరణ
విజయనగరం అర్బన్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో ఉమ్మడి విజయనగరం జిల్లాలకు చెందిన గ్రామీణ మహిళలకు ఉచితంగా ఉపాధి కోర్సుల్లో శిక్షణ ఇస్తామని సంస్థ డైరెక్టర్ డి.భాస్కరరావు తెలిపారు. మగ్గం వర్క్ అండ్ పెయింటింగ్‌కి 31 రోజులు, బ్యూటీ పార్లర్ మేనేజ్‌మెంట్‌కు 35 రోజులు శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. పదో తరగతి పాస్/ ఫెయిల్ అయిన 18 నుంచి 45 సంవత్సరాల మధ్య వయసున్న గ్రామీణ మహిళలు అర్హులని పేర్కొన్నారు. శిక్షణలో పాల్గొనే మహిళా అభ్యర్థులకు ఉచిత భోజనం, వసతి సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఆసక్తిగల గ్రామీణ మహిళలు ఈ నెల 18వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాల కోసం సెల్: 99595 21662, 99857 87820 నంబర్లను సంప్రదించాలని కోరారు.
40 కిలోల గంజాయి పట్టివేత
● పట్టుబడిన నలుగురిలో ఇద్దరు మహిళలు
విజయనగరం క్రైమ్: విజయనగరం రైల్వే పోలీసులు అక్రమంగా రవాణా చేస్తున్న 40 కేజీల గంజాయిని గురువారం స్వాధీనం చేసుకున్నారు. జీఆర్పీ ఎస్‌ఐ బాలాజీరావు తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగరం జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు సంయుక్తంగా విజయనగరం రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫాంపై తనిఖీలు నిర్వహిస్తుండగా మహారాష్ట్ర ఔరంగాబాద్ జిల్లాకు చెందిన గీతా సంజయ్ చౌహాన్, పారుబాయి సంజయ్ చౌహాన్‌లతో పాటు రజిని బీమాపవర్, వైశాలి కాలే వద్ద ఉన్న బ్యాగులలో గంజాయి ఉన్నట్టు గుర్తించారు. గంజాయిని ఒడిశా రాష్ట్రం బరంపురం ప్రాంతం నుంచి అక్రమంగా తరలిస్తున్నట్టు నిర్ధారించారు. కేసు నమోదుచేసి నలుగురినీ రైల్వే కోర్టులో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించారు.
పైడితల్లి వనంగుడి హుండీల ఆదాయం లెక్కింపు
పైడితల్లి వనంగుడి హుండీల ఆదాయం లెక్కింపు


