● అందని వైద్యం
ఈ చిత్రంలోని మహిళ పేరు పద్మ. ఆమెతోపాటు, చేతిలో ఉన్న చిన్నారి కొద్దిరోజులుగా మలేరియాతో బాధ పడుతోంది. గిరి శిఖర ప్రాంతం నుంచి మూడు రోజులుగా పార్వతీపురం మండలం డోకిశీల పీహెచ్‌సీకి వస్తోంది. అక్కడ వారికి సిబ్బంది ఇచ్చే సూది మందే దిక్కు. గతంలో ఇక్కడ ఇద్దరు వైద్యులు ఉండేవారు. ప్రస్తుతం సమ్మె కావడంతో ఎవరూ రావడం లేదు. జిల్లా వైద్య శాఖాధికారులు ప్రత్యామ్నాయంగా పీడియాట్రిషియన్‌ను జిల్లా ఆస్పత్రి నుంచి పంపిస్తున్నారు. చుట్టుపక్కల ఉన్న 52 గ్రామాలతోపాటు.. సమీపంలో ఉన్న దుగ్గేరు, ఒడిశాలోని కొన్ని ప్రాంతాల ప్రజలకూ ఈ ఆస్పత్రే ఆధారం.
పార్వతీపురం మండలం పెదబొండపల్లి పీహెచ్‌సీలో గత నెల వరకు ఇద్దరు వైద్యులు ఉండేవారు. సమ్మె కారణంగా ఇద్దరూ గత నెలాఖరు నుంచి విధులకు రావడం లేదు. దీంతో విజయనగరం మిమ్స్ నుంచి హౌస్ సర్జన్‌ను తాత్కాలికంగా డిప్యుటేషన్‌పై నియమించారు. రెగ్యులర్ వైద్యాధికారులు లేకపోవడం వల్ల ఇక్కడ రోగులకు పూర్తిస్థాయిలో అందడంలేదు. వచ్చిన వారిని సైతం జిల్లా ఆస్పత్రికి పంపించేస్తున్నారు. ఫలితంగా గతంలో 50–60 వరకు ఉండే ఓపీ.. ఇప్పుడు 30కి పడిపోయింది. చిన్నపాటి ఆరోగ్య సమస్యలకు ఏఎన్‌ఎం, అటెండర్, ఫార్మాసిస్ట్‌నే దిక్కవుతున్నారు. పురుడు పోయాలన్నా.. ఏఎన్‌ఎంలే ధైర్యం చేయాల్సిన పరిస్థితి.
● అందని వైద్యం


