● జిల్లా ఆస్పత్రికి రిఫర్
ఈ చిత్రంలోని విద్యార్థి పేరు కె.అఖిల్. డోకిశీల ఆశ్రమ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. దసరా సెలవులకు ఇంటికి వెళ్లాక అనారోగ్యం బారిన పడ్డాడు. అక్కడ కొద్దిరోజులు చికిత్స పొంది, పాఠశాలకు తిరిగొచ్చాడు. అప్పటికీ జ్వరం తగ్గకపోవడంతో పరీక్షలు చేయగా.. మలేరియా అని తేలింది. పాఠశాల పక్కనే డోకిశీల పీహెచ్‌సీ ఉంది. అక్కడ వైద్యసేవలు అందకపోవడంతో జిల్లా ఆస్పత్రికి తరలించారు. ముందురోజే ఇదే ఆశ్రమ పాఠశాల నుంచి మలేరియాతో బాధ పడుతున్న ఆరో తరగతి విద్యార్థి కె.రాజేష్‌ను కూడా జిల్లా ఆస్పత్రికే తరలించారు.


