విజయనగరం
న్యూస్‌రీల్
గురువారం శ్రీ 16 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులు పిట్టల్లా రాలిపోతున్నా ప్రభుత్వం స్పందించిన దాఖలాలు లేవు. ఫలితమే కురుపాం గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఓ పువ్వల అంజలి.. ఒక తోయక కల్పన.. సాలూరు నియోజకవర్గంలో కేజీబీవీ విద్యార్థిని బిడ్డిక కీర్తన.. ఈ చావుల పరంపర వీరితో ఆగిపోలేదు. నిన్న కాక మొన్న మూడో తరగతి విద్యార్థిని శాంత.. తాడంగి పల్లవి.. ఇప్పుడు అభంశుభం ఎరుగని బాలుడు, మక్కువ మండలం మూలవలస గ్రామవాసి, ఎర్రసామంత వలస ఆశ్రమ పాఠశాలలో ఆరో తరగతి చదుతున్న విద్యార్థి తాడంగి చిన్నారి. ఇలా.. ఏడాదిన్నర కాలంలో పార్వతీపురం మన్యం జిల్లాలోని ఆశ్రమ పాఠశాలలు, కేజీబీవీలు, ఇతర విద్యాసంస్థల్లో చదువుతున్న 15 మంది విద్యార్థులు అనారోగ్య సమస్యలతో ప్రాణాలు విడిచారు. మండంగి గౌతమ్, నిమ్మల అవంతి, పత్తిక దినేష్, నిమ్మక నితిన్, నిమ్మక జీవన్ కుమార్ తదితర విద్యార్థుల మరణాలతో మన్యం వణికిపోతున్నా ప్రభుత్వం చలించడం లేదు. కురుపాం బాలికల గురుకుల పాఠశాలలో 611 మంది విద్యార్థినులకు ఒకే ఏఎన్‌ఎం సేవలందిస్తున్నారంటే.. విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికై నా ప్రభుత్వం గిరిజన విద్యార్థుల మరణాల నివారణకు శాశ్వత చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటూ గిరిజన, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. విద్యార్థి చిన్నారి మృతదేహం వద్ద బుధవారం ఆందోళన చేశాయి. చిన్నారి మృతికి సమాధానం చెప్పాలంటూ ఐటీడీఏ అధికారులను, జిల్లా యంత్రాంగాన్ని, పాలకులను ప్రశ్నించాయి. చిన్నారి తల్లిదండ్రులు తాడంగి ముగిరి, కాంతమ్మ కన్నీటి రోదన వినాలని, చావులకు అంతం పలకాలంటూ నినదించాయి. మంత్రి సంధ్యారాణి తీరును ఎండగట్టాయి. రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి.
పత్తిక దినేష్ (ఫైల్) నిమ్మక నితిన్ (ఫైల్)
విజయనగరం
విజయనగరం
విజయనగరం
విజయనగరం
విజయనగరం
విజయనగరం


