●ఏపీఐఐసీ ఆధ్వర్యంలో ‘పారిశ్రామిక భాగస్వామ్య డ్రైవ్’ ప్
విజయనగరం అర్బన్: ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (ఏపీఐఐసీ) ఆధ్వర్యంలో ‘ఏపీఐఐసీ–పారిశ్రామిక భాగస్వామ్య డ్రైవ్’ పేరుతో నెల రోజులపాటు ప్రత్యేక కార్యక్రమాలు బుధవారం ప్రారంభమయ్యాయి. డ్రైవ్‌కు సంబంధించిన పోస్టర్‌ను బుధవారం కలెక్టర్ చాంబర్‌లో కలెక్టర్ ఎస్.రామ్‌సుందర్‌రెడ్డి ఆవిష్కరించారు. ఏపీఐఐసీ అధికారులు వారాల వారీగా చేపడుతున్న స్పెషల్ డ్రైవ్‌లో ఈ నెల 21వ తేదీ వరకు పరిశ్రమల ప్రాంగణాల్లో పరిశుభ్రత, పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ నెల 22 నుంచి 28వ తేదీ వరకు పచ్చదనం పెంపు, ఈ నెల 29 నుంచి నవంబర్ 5వ తేదీ వరకు పరిశ్రమలతో భాగస్వామ్యం, పెట్టుబడుల ప్రోత్సాహం, నవంబర్ 6 నుంచి 15వ తేదీ వరకు పరిశ్రమల మౌలిక వసతుల ఆధునీకరణ, సుస్థిరత చర్యల అమలు వంటి కార్యక్రమాలను చేపడతారు. కార్యక్రమంలో ఏపీఐఐసీ డీజెడ్‌ఎం కె.జయచంద్ర, జేసీ వి.రాజేష్ కుమార్ పాల్గొన్నారు.


