
పేదరిక నిర్మూలనే పీ–4 లక్ష్యం
● జేసీ సేతుమాధవన్
విజయనగరం అర్బన్: పేదరక నిర్మూలనే పీ–4 లక్ష్యమని జేసీ సేతుమాధవన్ అన్నారు. మార్గదర్శులు బంగారు కుటుంబాలను దత్తత తీసుకొని పేదరికం నుంచి శాశ్వతంగా బయటకు తీసుకువచ్చేందుకు కృషిచేయాలని కోరారు. పీ–4 కార్యక్రమం, బంగారు కుటుంబాలు, మార్గదర్శుల పాత్రపై సచివాలలయ సిబ్బంది నుంచి ఎంపిక చేసిన ఎంఓటీలు, టీఓటీలకు కలెక్టరేట్ ఆడిటోరింయలో మంగళవారం ఒక రోజు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ పీ–4 కార్యక్రమంలో సచివాలయ సిబ్బందిది కీలక పాత్ర అని, బంగారు కుటుంబాలకు, మార్గదర్శులకు మధ్య వారధిగా పనిచేయాలన్నారు. సీపీఓ పి.బాలాజీ మాట్లాడుతూ మండలానికి ఇద్దరు చొప్పున మాస్టర్ ఆఫ్ టైనీలు, టీఓటీలను ఎంపిక చేసి శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. కార్యక్రమం కోసం రూపొందించిన ప్రత్యేక యాప్‌పై అవగాహన కల్పిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ముఖ్యప్రణాళిక విభాగం డిప్యూటీ డైరెక్టర్ రాజశేఖర్, స్వర్ణాంధ్ర పీ–4 కార్యక్రమం కన్సల్టెంట్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

పేదరిక నిర్మూలనే పీ–4 లక్ష్యం