
ఆందోళన వద్దు.. వదంతులు నమ్మవద్దు
● రూరల్ సీఐ రంగనాథం
పార్వతీపురం రూరల్: మండలంలోని బాలగుడబ గ్రామ సమీపంలో గల నేలబావి వద్ద ఉన్న దుర్గాదేవి ఆలయంలో విగ్రహం ధ్వంసం జరిగిందన్న ఘటనపై పార్వతీపురం రూరల్ సీఐ రంగనాథం, ఎస్సై సంతోషికుమారి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి జరిగిన ఘటనపై వివరించారు. కొన్నేళ్ల క్రితం అమ్మవారి విగ్రహంలో ఎడమచేయి శిథిలమవడంతో మరమ్మతులు చేసి స్థానిక భక్తులు ఏర్పాటు చేశారని ఈ మేరకు క్రమేణా మళ్లీ అదే చోట శిథిలమైనట్లు తమకు సమాచారం వచ్చిన వెంటనే క్లూస్‌టీం ద్వారా పరిశీలించి, అ స్థానిక గ్రామ పెద్దలు, భక్తులతో మాట్లాడి విచారించిన అనంతరం ఎలాంటి విధ్వంస చర్యలు జరగలేదని నిర్ధారణకు వచ్చినట్లు తెలిపారు. ఈ మేరకు ఎవరూ ఆందోళన చెందనవసరంలేదని, అలాగే ఇలాంటి సున్నితమైన విషయాలు, వదంతాలు స్పష్టత లేకుండా నమ్మవద్దని తెలిపారు.