
నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక
విజయనగరం అర్బన్: కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవా రం ఉదయం 10 గంట ల నుంచి ప్రజా సమ స్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి అర్జీల ను స్వీకరించనున్నట్టు కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగానే జిల్లా కేంద్రంతో పాటు అన్ని డివిజన్, మండల కేంద్రాల్లో, మున్సిపల్ కార్యాలయాల్లో కూడా ప్రజా సమస్యల పరిష్కార వేదిక–మీకోసం కార్యక్రమం జరుగు తుందని కలెక్టర్ వివరించారు. అర్జీదారులు వారి అర్జీలు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవడాని కి ‘మీకోసం.ఏపీ.జీఓవి.ఐఎన్’ వెబ్‌సైట్ అందుబాటులో ఉందన్నారు. నమోదైన అర్జీల గురించి, వాటి పరిష్కార స్థితికి సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి 1100 నంబరు కు నేరుగా కాల్ చేసి సంప్రదించాలని కలెక్టర్ కోరారు.
మరో వారం పాటు డయల్ యువర్ కలెక్టర్
కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ప్రధానంగా ఎరువుల సరఫరాపై రైతుల సమ స్యలను మరింతగా తెలుసుకోవడానికి వారి సూచనలు, సలహాలను స్వీకరించడానికి ఈ కార్యక్రమాన్ని మరో వారంరోజుల పాటు కొనసాగించాలనే నిర్ణయాన్ని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తీసుకున్నారు. సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు 9441957315 నంబరుకు రైతులు ఫోన్ చేసి యూరియా సరఫరాలో సమస్యలు, అభిప్రాయాలను తెలియజేయవచ్చని కలెక్టర్ సూచించారు.
విజయనగరం అర్బన్: ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఇవ్వాల్సిన డీఏలు, పీఎఫ్ ఇతర ఆర్థ్ధిక బకాయిలను వెంటనే చెల్లించాలని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ డాక్టర్ గాదె శ్రీనివాసుల నాయుడు డిమాండ్ చేశారు. స్థానిక పీఆర్‌టీ యూ కార్యాలయంలో ఆదివారం జరిగిన సంఘం జిల్లా స్థాయి సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీఆర్‌సీ ప్రకటించడానికి ఆలస్యమైన కారణంగా ఐఆర్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉపాధ్యాయులు యాప్ ల వినియోగం వంటి బోధనేతర పనుల ఒత్తిడి తో ఇబ్బంది పడుతున్నారని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లానని తెలిపారు. సంఘం జిల్లా అధ్యక్షుడు డి.శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగి న సమావేశంలో సంఘం నాయకులు వి.రవీంద్రనాయుడు, రావాడ రాంబాబు, ఆల్తి రాంబా బు, బంకపల్లి శివప్రసాద్, రామకృష్ణ, తిరుపతినాయుడు, శంకర్‌నాయుడు పాల్గొన్నారు.
సీతంపేట: స్థానిక గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలను ట్రైబుల్ వెల్ఫేర్ డీడీ అన్నదొర ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా భోజన పదార్థాలు పరిశీలించారు. అన్నం, కూరలు రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం స్టాక్ రిజిస్టర్‌ను పరిశీలించారు. బాలికల ఆరోగ్య పరిస్థితులు తెలుసుకున్నారు. జ్వరం, ఇతర వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కిచెన్ గార్డెన్, మరుగుదొడ్లు, డార్మెటరీ పరిశీలించారు. అనంతరం పదో తరగతి విద్యార్థినుల సామర్థ్యాలను పరిశీలించారు.