
సీఎం, పీఎం మోసపూరిత విధానాలతో ప్రజలకు నష్టం
రాజాం సిటీ: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ప్రధానమంత్రి నరేంద్రమోదీ తమ మోసపూరిత విధానాలతో ప్రజలను మభ్యపెడుతున్నారని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సింగరావు అన్నారు. రాజాంలో రెండు రోజుల పాటు జరగను న్న సీఐటీయూ 11వ జిల్లా మహసభలు ఆదివారం ప్రారంభించారు. ముందుగా అంబేడ్కర్ జంక్షన్ నుంచి ర్యాలీ నిర్వహించారు. అనంతరం చీపురుపల్లి రోడ్డులోని ఓ ఫంక్షన్ హాల్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేటీకరణ పేరుతో సీఎం, పీఎంలు వ్యవహరిస్తున్నారని, అలాగే సీఎం కుర్చీ కోసం పవన్‌కల్యాణ్ తపిస్తున్నారని ఎద్దేవా చేశారు. జీతాలు పెంచడం కార్మికుల హక్కు అన్నారు. రాష్ట్రంలో మూడు లక్షల పైనే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులతో పనిచేయిస్తున్నారన్నారు. పెట్టుబడిదారులకు అనుకూలంగా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని అన్నారు. తెల్ల వారి లేస్త్తే చంద్రబాబు లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నామంటూ ప్రకటనలు చేసి ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. ఒకప్పుడు వ్యవసాయం దండగ అనే పెద్దమనిషి అదే ఇప్పుడు నిజం చేస్తున్నా రని పేర్కొన్నారు. యూరియా కోసం రైతులు పాట్లు పడుతుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేకపోవడం బాధాకరమని అన్నారు. ఎరువు లు కావాల్సిన దానికంటే అధికంగా ఉత్పత్తి అవుతుందని, రాష్ట్ర ప్రభుత్వం విధానంతో ఈ రోజు రైతులకు ఎరువులు అందని పరిస్థితి నెలకొందన్నా రు. రైతులకు గిట్టుబాటు ధర నామమాత్రంగా ఉందన్నారు. పోరాటాల ద్వారా హక్కులు సాధించేందుకు సమర శంఖారావం పూరించడానికి కార్మిక వర్గం సిద్ధపడాలన్నారు. జిల్లాలో జ్యూట్ పరిశ్రమలు మూతపడ్డాయని, ఒక్క రంగం కూడా అభివృద్ధి కాలేదని ధ్వజమెత్తారు. జిల్లాను అభివృద్ధి చేయడానికి ప్రణాళిక వెల్లడించాలని ప్రభుత్వా న్ని డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు రూ. 11440 కోట్లు ఇచ్చామని చెప్పడం పచ్చి అబద్ద మని అన్నారు. అది కూడా తీసుకున్న లోను రీపేమెంట్ చేశారని, రూ.500ల కోట్లు వీఆర్‌ఎస్ తీసు కున్న ఉద్యోగులకు ఇచ్చారని తెలిపారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయాలనే ఉద్దేశంతోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయ న్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను పోరాటం ద్వారానే ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంటామని తెలిపారు. సభలో రాష్ట్ర కార్యదర్శి సుబ్బరావమ్మ, జిల్లా ప్రధాన కార్యదర్శి కాకి సురేష్, పి.శంకరరావు, టి.సూర్యనారాయణ, టీవీ రమణ, జగన్మోహనరావు, త్రినాధ్, వివిద యూనియన్ల సభ్యులు పాల్గొన్నారు.