
రైలులో ముమ్మర తనిఖీలు
కొమరాడ: రాయిపూర్ నుంచి విశాఖ వెళ్లే పాసింజర్ ట్రైన్‌లో అక్రమంగా గంజాయి, నిషేధిత వస్తువులు తరలి వెళ్తుతున్నాయన్న సమాచారం మేరకు ఎస్సై కె.నీలకంఠం ఆధ్వర్యంలో ఆర్‌పీఎఫ్ సిబ్బంది, డాగ్‌స్క్వాడ్, ఈగల్ టీం తో పార్వతీపురం టౌన్ రైల్వే స్టేషన్‌లో రైలులో బుధవారం ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ ఒడిశా, రాయిపూర్ లాంటి ప్రాంతాల నుంచి గంజాయితో పాటు పలు నిషేధిత పదార్థాలతో అక్రమ వ్యాపారులు ప్రయాణం చేస్తున్నారని వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చిరించారు.