రైలు ఢీ కొని గుర్తు తెలియని వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

రైలు ఢీ కొని గుర్తు తెలియని వ్యక్తి మృతి

Sep 6 2025 7:12 AM | Updated on Sep 6 2025 7:12 AM

రైలు

రైలు ఢీ కొని గుర్తు తెలియని వ్యక్తి మృతి

రైలు ఢీ కొని గుర్తు తెలియని వ్యక్తి మృతి

బొండపల్లి: మండలంలోని బొండపల్లి – గరుడబిల్లి రైల్వేస్టేషన్ల మధ్యలో రైలు ఢీ కొనడంతో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడని జీఆర్‌పై హెచ్‌సీ బి. ఈశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. తమకు అందిన సమాచారం మేరకు పట్టాలపై వెళ్లి చూడగా సుమారు 30 సంవత్సరాల యువకుడి తీవ్ర గాయాలతో మృతి చెంది ఉన్నాడని చెప్పారు. మృతుడు పసుపు రంగు టీ షర్ట్‌, నలుపు రంగు ఫ్యాంట్‌ ధరించాడని తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా కేంద్రంలోని సర్వజన ఆస్పత్రికి తరలించామని, వివరాలు తెలిసిన వారు 94906 17089, 94918 13163 నంబర్లను సంప్రదించాలని కోరారు.

గుర్తు తెలియని వాహనం ఢీ కొని మరొకరు..

బొండపల్లి: మండల కేంద్రంలోని పోలీస్‌ స్టేషన్‌కు సమీపంలో గుర్తు తెలియని వాహనం ట్రాలీ రిక్షాను ఢీ కొనడంతో ఒకరు తీవ్రంగా గాయపడిన సంఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్సై యు. మహేష్‌ తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. గజపతినగరం మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన శిర నాగరాజు (42) బొండపల్లి మండలంలోని బోడిసింగిపేటలో జరిగిన వినాయక నిమజ్జనోత్సవానికి ట్రాలీ తీసుకెళ్లాడు. నిమజ్జనం అయిన తర్వాత తిరిగి ఇంటికి వెళ్తుండగా..బొండపల్లి పోలీస్‌ స్టేషన్‌ సమీపంలో వెనుకనుంచి వస్తున్న గుర్తు తెలియని వాహనం రిక్షాను ఢీ కొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన నాగరాజును జిల్లా కేంద్రంలోని సర్వజన ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొదుతూ శుక్రవారం ఉదయం మృతి చెందాడు. మృతుడికి భార్య గౌరి, ఇద్దరు పిల్లలున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చికిత్స పొందుతూ వ్యక్తి..

చీపురుపల్లి: కొద్ది రోజుల కిందట రోడ్డు ప్రమాదంలో గాయపడిన పట్టణంలోని హడ్కో కాలనీకి చెందిన నాదెళ్ల శ్రీనివాసరావు విశాఖపట్నం కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. ఆగస్టు 29న శ్రీనివాసరావు తన స్నేహితుడు మదీనాతో కలిసి తన ఫొటో స్టూడియో నుంచి హడ్కో కాలనీలోని ఇంటికి వెళ్తుండగా.. గరివిడి నుంచి చీపురుపల్లి వైపు వస్తున్న ద్విచక్ర వాహనదారుడు ఢీ కొట్టాడు. దీంతో శ్రీనివాసరావు తలకు తీవ్ర గాయాలు కాగా.. వెంటనే స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం విజయనగరం మహారాజా ఆస్పత్రికి అక్కడ నుంచి విశాఖ కేజీహెచ్‌కు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ శ్రీనివాసరావు కన్నుమూశాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

హత్య కేసులో నిందితుల అరెస్ట్‌

డీఎస్పీ భవ్యారెడ్డి

గజపతినగరం రూరల్‌: మండలంలోని కొత్తబగ్గాం గ్రామంలో ఈనెల 2వ తేదీన జరిగిన హత్య కేసుకు సంబంధించి ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేసినట్లు బొబ్బిలి డీఎస్పీ భవ్యారెడ్డి తెలిపారు. శుక్రవారం సాయంత్రం స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఆమె మాట్లాడుతూ.. గ్రామానికి చెందిన పసుపురెడ్డి శ్రీను, పసుపురెడ్డి చంటితో పాటు మరో ఇద్దరు మండల పరిధి కొణిశ గ్రామంలోని మద్యం దుకాణం వద్ద ఈ నెల 2వ తేదీన వాదులాడుకున్నారన్నారు. వాగ్వాదం అనంతరం పసుపురెడ్డి చంటి తన అన్నయ్య పసుపురెడ్డి శ్రీనును ఎలాగైనా అంతం చేయాలని నిర్ణయించుకుని ఇంటికి వెళ్లి కత్తి తీసుకువచ్చి గ్రామ సమీపంలోని రోడ్డు పక్కన చీకట్లో మాటువేశాడని తెలిపారు. ఇంతలో శ్రీను ద్విచక్ర వాహనంపై వస్తుండగా.. వెంటనే ఆపి పక్కనే ఉన్న పొలాల్లోకి తీసుకెళ్లి కత్తితో పొడిచి హత్య చేశాడని చెప్పారు. ఈ హత్యకు సంబంధించి పసుపురెడ్డి చంటికి అతని మిత్రుడు గుమ్మడి రామచంద్రుడు సహకరించడంతో ఇద్దరినీ గజపతినగరం రైల్వేస్టేషన్‌ వద్ద అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. సమావేశంలో సీఐ రమణ, ఎస్సై కిరణ్‌కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

భార్యాభర్తల ఆత్మహత్యాయత్నం..

వంగర: మండల పరిధి మడ్డువలస పంచాయతీ జగన్నాథవలస గ్రామానికి చెందిన భార్యాభర్తలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. గ్రామానికి చెందిన గంధం చిన్నకు ఈ ఏడాది ఫిబ్రవరిలో శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం గొబ్బూరు గ్రామానికి చెందిన సాయితో వివాహం జరిగింది. అయితే తన భర్తకు అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో భార్య కన్నవారింటికి వెళ్లిపోయింది. అనంతరం జి.సిగడాం పోలీస్‌స్టేషన్‌లో భర్తపై ఫిర్యాదు కూడా చేసింది. ఈక్రమంలో పెద్దలు జోక్యం చేసుకుని భార్యాభర్తలకు సర్దిచెప్పారు. దీంతో వారిద్దరూ జగన్నాథవలసలో ఉంటుండగా.. తాజాగా తన భర్త అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళతో మాట్లాడాడని అనుమానిస్తూ సాయి శుక్రవారం ఉదయం గడ్డి మందు తాగేసింది. దీంతో మనస్తాపానికి గురైన ఆమె భర్త చిన్న కూడా గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే కుటుంబ సభ్యులు గమనించి వారిద్దరినీ రాజాం సీహెచ్‌సీకి తరలించారు. ఏఎస్సై సూర్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రైలు ఢీ కొని గుర్తు తెలియని వ్యక్తి మృతి1
1/4

రైలు ఢీ కొని గుర్తు తెలియని వ్యక్తి మృతి

రైలు ఢీ కొని గుర్తు తెలియని వ్యక్తి మృతి2
2/4

రైలు ఢీ కొని గుర్తు తెలియని వ్యక్తి మృతి

రైలు ఢీ కొని గుర్తు తెలియని వ్యక్తి మృతి3
3/4

రైలు ఢీ కొని గుర్తు తెలియని వ్యక్తి మృతి

రైలు ఢీ కొని గుర్తు తెలియని వ్యక్తి మృతి4
4/4

రైలు ఢీ కొని గుర్తు తెలియని వ్యక్తి మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement