
ఉద్యోగుల డిమాండ్ల సాధనకోసం వినూత్న నిరసన
విజయనగరం అర్బన్: ఉద్యోగుల డిమాండ్ల సాధన కోసం ఏపీజీఈఏ సంఘం జిల్లా కమిటీ ‘టీ తాగుతూ మాట్లాడుకుందాం’ పేరుతో కలెక్టరేట్ టీ పాయింట్ వద్ద బుధవారం వినూత్న రీతిలో నిరసన తెలిపింది. ఈ సందర్భంగా సంఘ జిల్లా ప్రతినిధులు మాట్లాడుతూ ఉద్యోగుల పెండింగ్ బిల్లులు, కాంట్రాక్టు ఉద్యోగులకు మినిమం టైమ్‌స్కేల్ వంటి అంశాల సాధన కోసం ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సంఘ నాయకులు కంది వెంకటరమణ, బాలభాస్కర్, సీహెచ్ సతీష్, ఎంటీఎస్ ఉద్యోగులు శంకరరావు, రాంబాబు, వివిధ శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు.