
ఆందోళనలో రైతులు
అర్ధన్నపాలెం, వీరభద్రపురం, చింతలపాలెం గ్రామాల్లో కొండపోరంబోకు భూములు ఉన్నాయి. ఆ భూములు ప్రస్తుతం రైతుల సాగులో ఉన్నాయి. పెదరావుపల్లి గ్రామంలోని సర్వేనంబర్ 48 నుంచి 62 వరకు ఉన్న భూముల్లో సుమారు 60 మంది రైతులు తమ పూర్వీకులనుంచి మామిడి తోటలు సాగుచేస్తున్నారు. ఈ తోటలపై వచ్చే ఆదాయంతో కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. ఈ భూములపై హక్కులు కల్పించాలని 1986 సంవత్సరంలో రైతులు ఎస్.కోట కోర్టును ఆశ్రయించారు. వారికి అనుకూలంగా 1996లో తీర్పువచ్చినా అప్పటి టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. 2016లో మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు కూడా రైతులకు అనుకూలంగా తీర్పు ఇచ్చినా అధికారులు పట్టించుకోలేదు. 2019 సంవత్సరంలో అధికారంలోకి వచ్చిన జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం 2022లో గ్రామంలో సమగ్ర రీ సర్వే నిర్వహించి రైతులందరికీ డీ పట్టాలను అందజేసింది. రైతులకు శాశ్వత హక్కులను కల్పిస్తూ పట్టాదారు పుస్తకాలను కూడా జారీచేసింది.