
అగ్రిగోల్డు భూముల మ్యుటేషన్ ప్రక్రియ పూర్తిచేయండి
● జేసీ సేతు మాధవన్
విజయగనరం అర్బన్: ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో అగ్రిగోల్డు భూముల మ్యుటేషన్ ప్రక్రియను వెంటనే పూర్తిచేయాలని రెవెన్యూ అధికారులను జాయింట్ కలెక్టర్ ఎస్.సేతుమాధవన్ ఆదేశించారు. అగ్రిగోల్డు భూములకు సంబంధించి జిల్లాస్థాయి కమిటీ సమావేశం జేసీ చాంబర్‌లో మంగళవారం జరిగింది. రామభద్రపురం, మెంటాడ, గజపతినగరం, విజయనగరం మండలాల్లో ఉన్న అగ్రిగోల్డు సంస్థ ఆస్తులు, వాటి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. భూముల రీ సర్వే, భౌతిక పరిశీలనపై ఆరా తీశారు. మర్కెట్ విలువను లెక్కించి ఇవ్వాలని జిల్లా రిజిస్ట్రార్‌కు సూచించారు. బుధవారం సాయంత్రంలోగా వ్యవసాయ భూముల మ్యుటేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని తహసీల్దార్లను ఆదేశించారు. భూముల మ్యుటేషన్ పూర్తయిన తరువాత వేలం వేస్తామని చెప్పారు. సమావేశంలో డీఆర్వో ఎస్.శ్రీనివాసమూర్తి, సీఐడీ డీఎస్పీ ఎం.ఎన్.భూపాల్, నాలుగు మండలాల తహసీల్దార్లు, వివిధ శాఖల ప్రతినిధులు, సీఐడీ ఇన్‌స్పెక్టర్లు, కలెక్టరేట్ అధికారులు పాల్గొన్నారు.
పోలీస్ సేవలను మరింత చేరువ చేస్తాం
● ఎస్పీ వకుల్ జిందల్
గంట్యాడ: పోలీస్ సేవలను మరింత చేరువచేసేందుకు పోలీస్ అవుట్‌పోస్టును ఏర్పాటుచేసినట్టు ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. గంట్యాడ మండలం తాటిపూడి గ్రామంలో ఏర్పాటుచేసిన పోలీస్ అవుట్ పోస్టును మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ కల్పించడం కోసం అవుట్ పోస్టును ప్రారంభించామన్నారు. తాటిపూడి జలాశయం చూసేందుకు, బోటింగ్‌కు పర్యాటకుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని, ఈ ప్రాంతంలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా నియంత్రించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. జలాశయంలో బోటింగ్‌కు వెళ్లే సమయంలో టూరిస్టులు తప్పనిసరిగా లైఫ్ జాకెట్స్‌ను వేసుకోవాలన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ సౌమ్యలత, విజయనగరం డీఎస్పీ ఎం.శ్రీనివాసరావు, ఎస్బీ సీఐ ఎ.వి.లీలారావు, విజయనగరం రూరల్ సీఐ బి.లక్ష్మణరావు, ఎస్‌ఐ డి.సాయికృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
అంతిమ యాతన..!
వేపాడ: మండలంలో వీలుపర్తి గ్రామంలో కొన్ని కులాలకు కేటాయించిన శ్మశానానికి వర్షాకాలంలో వెళ్లాలంటే నరకయాతన తప్పదు. గ్రామానికి చెందిన గుమ్మలగోవింద అనే మహిళ అనారోగ్యంతో మంగళవారం చనిపోయారు. మృతదేహాన్ని తరలించేందుకు రోడ్డు మార్గంలేకపోవడంతో కనుమలచెరువులో నడుంలోతు నీటిలో దిగి తీసుకెళ్లారు. అధికారులు స్పందించి శ్మశానానికి రోడ్డు సదుపాయం కల్పించాలని గుమ్మాల రమణ, లక్ష్మణ తదితరులు కోరారు.

అగ్రిగోల్డు భూముల మ్యుటేషన్ ప్రక్రియ పూర్తిచేయండి

అగ్రిగోల్డు భూముల మ్యుటేషన్ ప్రక్రియ పూర్తిచేయండి