ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం పైడితల్లి అమ్మవారికి మంగళవారం సాయంత్రం శ్రీ సింహాశైల సేవా సమితి ప్రతినిధి, టీటీడీ ధార్మిక కమిటీ సభ్యురాలు ఎన్.హరిలక్ష్మి ఆధ్వర్యంలో ఆషాఢం సారెను భక్తులు సమర్పించారు.
విజయనగరం లయన్స్ క్లబ్ వద్ద నుంచి కోట కూడలి మీదుగా మేళతాళాలు, కోలాట ప్రదర్శనలు, పులివేషధారణలు, భక్తుల భజనల నడుమ ఊరేగింపుగా సారెను తీసుకెళ్లారు. అమ్మవారికి పసుపు, కుంకుమలు, పువ్వులు, వివిధ రకాల స్వీట్లు, పండ్లను సమర్పించారు. ఆలయ అధికారులు, సిబ్బంది భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లను పర్యవేక్షించారు.
– విజయనగరం టౌన్
● పైడితల్లికి ఆషాఢం సారె