
సుపరిపాలన అంటే సిగ్గేస్తోంది..!
– టీడీపీ నాయకుడి ఆడియో వైరల్
బాడంగి: ఎమ్మెల్యే బేబీనాయన తనను గ్రామంలో సుపరిపాలన కార్యక్రమాన్ని చేపట్టమని సూచించారు.. గ్రామస్తులు నీళ్లడిగితే ఇవ్వలేకపోయాం.. సుపరిపాలన అంటేనే సిగ్గేస్తోంది.. రాజు వస్తేనే చేస్తానన్నాను.. అంటూ మండలంలోని పెదపల్లి గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడి ఆడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చంద్రబాబు ప్రభుత్వ పాలనను సొంతపార్టీ నాయకులే విమర్శిస్తుండడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఆడియోను వెంటనే డిలేట్ చేయించాలంటూ బుడా చైర్మన్ లక్ష్మునాయుడు ఆదేశించినట్టు తెలిసింది. అయితే, ఇది అప్పటికే వైరల్ కావడం, ఆయన అన్నది నిజమే కదా అంటూ వైఎస్సార్‌సీపీ నాయకులు కామెంట్‌లు పెట్టడంతో టీడీపీ నాయకులు మిన్నకున్నారు.