
అదానీ బృందాన్ని అడ్డుకున్న గిరిజనులు
వేపాడ: ప్రాణాలైనా అర్పిస్తాం కానీ ఊరు విడిచివెళ్లమంటూ మారిక గిరిజనులు సీపీఎం ఆధ్వర్యంలో మంగళవారం ఆందోళన నిర్వహించారు. అదానీ బృందం సభ్యులు, అధికారులు మారిక వెళ్లేందుకు ప్రయత్నించినప్పటికీ సీపీఎం నాయకుడు చలు మూరి శ్యామ్‌తో పాటు జాలారి వీర్రాజు, గమ్మెల బాబురావు, సోమేష్, అప్పలనాయుడు, పలువురు మహిళలు అదానీ బృందం, అధికారులు కొండక్కెకుండా రోడ్డుకు అడ్డుగా కంచెవేసి బ్యానర్ పెట్టి మార్గమధ్యంలోనే అడ్డుకున్నారు. అదానీ గ్రూప్ గో బ్యాక్.. అధికారులు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.