
రైతును మోసగిస్తే చట్టపరమైన చర్యలు
గ్రామాల్లో ఎవరైనా లైసెన్స్ లేకుండా విత్తనాలు, ఎరువులు,పురుగు మందులు విక్రయిస్తున్నట్లు తెలిస్తే వెంటనే వ్యవసాయ,విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేయాలి. మందుల లాట్ నంబర్‌ను బట్టి తయారు చేసిన తేదీని గుర్తించి ఏ కంపెనీ, ఏ రకం వంటి విషయాలను కొనుగోలుదారులు పరిశీలించాలి. రైతులు పురుగు మందు, ఎరువుల కొనుగోలులో జాగ్రత్తలు పాటించాలి. వ్యాపారులు నకీలి పురుగు మందులు, ఎరువులు విక్రయించి రైతులను మోసగిస్తే సంబంధిత డీలర్‌పై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.
టి.అప్పలనాయుడు, విజిలెన్స్ సీఐ