
రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువు
సాలూరు: కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, మహిళలకు రక్షణ కరువైందని వైఎస్సార్‌సీపీ మహిళావిభాగం జిల్లా అధ్యక్షురాలు, మాజీ జెడ్పీటీసీ రెడ్డి పద్మావతి విమర్శించారు. ఈ మేరకు సోమవారం ఆమె పట్టణంలో మాట్లాడుతూ, కృష్ణా జిల్లా చైర్‌పర్సన్ ఉప్పాల హారికపై టీడీపీ, జనసేన గూండాల దాడిని ఆమె ఖండించారు. జిల్లాకు ప్రథమ పౌరురాలైన ఓ మహిళ పరిస్థితి ఇలా ఉందంటే ,రాష్ట్రంలో మిగిలిన మహిళల పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చని వాపోయారు. వైఎస్సార్‌సీపీ నేతలపై కక్షపూరితంగా ఈ ప్రభుత్వం దాడులు, దౌర్జన్యాలు, వేధింపులకు పాల్పడుతూ ఏడాదిపాలనను పూర్తిచేసిందని విమర్శించారు. ప్రజలు అంతా గమనిస్తున్నారని సరైన సమయంలో తగిన బుద్ధి చెప్తారన్నారు.
వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు రెడ్డి పద్మావతి