
అర్జీలు సకాలంలో పరిష్కరించాలి
చికెన్
బ్రాయిలర్ లైవ్ డెస్‌డ్ స్కిన్‌లెస్ శ్రీ90 శ్రీ150 శ్రీ160
విజయనగరం అర్బన్: ప్రజా వినతుల పరిష్కార వేదికకు వచ్చే వినతులను సకాలంలో పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో అర్జీల పరిష్కారంపై శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా వినతుల పరిష్కార వేదికకు వచ్చే వినతులను సకాలంలో పరిష్కరించాలని స్పష్టం చేశారు. అధికారులు ప్రతిరోజూ పీజీఆర్‌ఎస్ పోర్టల్‌లో లాగిన్ అయి వారి శాఖలకు సంబంధించిన వినతులను చూడాలని, అలాగే రీ ఓపెన్ కేసులు కూడా పూర్తిగా విచారణ జరిపి ముంగించాలని సూచించారు. కొన్ని శాఖలకు సంబంధించిన వినతులను చూడాలని, అలాగే రీ ఓపెన్ కేసులు కూడా పూర్తిగా విచారణ జరిపి ముగించాలని చెప్పారు. కొన్ని శాఖలకు సంబంధించిన అర్జీలు సకాలంలో పరిష్కరించకపోవడం, గడువు దాటి ఉండడం, నాణ్యమైన పరిష్కారం చూపకపోవంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అందుకు గల కారణాలపై ఆరా తీశారు. అధికారులు అర్జీదారులతో మర్యాదగా మాట్లాడాలని, సవివరంగా ఎండార్స్‌మెంట్ ఇవ్వాలని గడువు లోగానే వినతులకు నాణ్యమైన సమాధానాలు పంపాలని ఆదేశించారు. సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌కు 225 వినతులు అందాయి. సంయుక్త కలెక్టర్ సేతు మాధవన్‌తోపాటు డీఆర్‌వో ఎస్.శ్రీనివాసమూర్తి, డిప్యూటీ కలెక్టర్‌లు మురళీ, ప్రమీలా గాంధీ, ఎం.వెంకటేశ్వరరావు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.
ఇందిరమ్మ కాలనీకి రోడ్డు, కాలువలు కావాలి
గరివిడి మండలం కొండపాలెం పంచాయతీ పరిధిలోని ఇందిరమ్మ కాలనీలో మౌలిక సదుపాయాల కొరత పట్టిపీడిస్తోందని కాలనీ మహిళలు సామూహికంగా పీజీఆర్‌ఎస్‌కు వచ్చి జేసీ సేతుమాధవన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. దాదాపు 500 ఇళ్లు ఉన్న ఈ కాలనీలో పక్కారోడ్డుగానీ, డ్రైనేజ్ వ్యస్థగానీ లేకపోవడం వల్ల నివాసం దుర్భరంగా మారిందని అర్జీద్వారా మొరపెట్టుకున్నారు.
ఎస్పీ పీజీఆర్‌ఎస్‌కు 38 ఫిర్యాదులు
విజయనగరం క్రైమ్: పోలీస్ స్టేషన్‌కు చ్చిన సమస్యలను చట్టపరిధిలో పరిష్కరించాలని ఎస్పీ వకుల్ జిందల్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్పీ వకుల్ జిందల్, ఏఎస్పీ సౌమ్యలతలు పాల్గొని ఫిర్యాదుదారుల సమస్యలను ఆలకించారు. కార్యక్రమంలో మొత్తం 38 మంది ఫిర్యాదులు అందుకున్నారు. వచ్చిన ఫిర్యాదు దారుల ముందే సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్లతో ఎస్పీ, ఏఎస్పీలు నేరుగా మాట్లాడారు. కార్యక్రమంలో ఎస్బీ సీఐ ఆర్వీఆర్‌కే చౌదరి, డీసీఆర్బీ సీఐ బి.సుధాకర్, ఎస్సై రాజేష్, సిబ్బంది పాల్గొన్నారు.
జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్
పీజీఆర్‌ఎస్‌కు 225 వినతులు

అర్జీలు సకాలంలో పరిష్కరించాలి