
రెజ్లింగ్ పోటీల్లో విజేతలుగా గుంపాం విద్యార్థులు
పూసపాటిరేగ: మండలంలోని గుంపాం జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి గ్రాప్లింగ్ రెజ్లింగ్ కుస్తీ పోటీలకు ఎంపికయ్యారు. ఈనెల 13న తిరుపతిలో జరిగిన గ్రాప్లింగ్ రెజ్లింగ్ కుస్తీ క్రీడా పోటీల్లో గుంపాం గ్రామానికి చెందిన కె.హర్షవర్ధన్, ఎ. గౌతమ్, పి.గిరీష్, టి.హేమని, పి.రవిజిత్ కుమార్, కె. సంజయ్‌లు పాల్గొని పతకాలు సాధించారు. ఈనెల 26న జాతీయస్థాయిలో ఛతీ్‌త్‌స్‌గఢ్ రాష్ట్రం బిలాస్‌పూర్‌లో జరగనున్న పోటీల్లో ఈ విద్యార్థులు పాల్గొననున్నారు. పాఠశాలకు చెందిన విద్యార్థులు విజేతలుగా నిలవడంతో హెచ్‌ఎం సూర్యకుమారి, పీఈటీ ఆదిలక్ష్మి, ఉపాధ్యాయిలు షేక్‌మస్తాన్, ఉమ తదితరులు అభినందించారు.