
రైతులతో రాజకీయ ఆటలు
కూటమి ప్రభుత్వంలో పాలకులు కంటే అధికారులు తీరు ప్రమాదకరంగా మారింది. పాలకుల మెప్పుకోసం అత్యూత్సాహం ప్రదర్శిస్తున్నారు. మడ్డువలస కాలువ ఆయకట్టు పరిధిలో గడిచిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఎప్పుడూ సాగునీటి ఇబ్బందులు రాలేదు. కాలువ గట్లకు వరదలు, వర్షాలతో గండ్లు పడితో ఒక్కరోజు వ్యవధిలో పూడ్చిపెట్టి నీటిని ఇచ్చే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. టీడీపీ కార్యకర్తల జేబులకు ఓఅండ్‌ఎమ్ నిధులు మళ్లించేందుకే అన్నట్టు పనులు జరుపుతున్నారు. కాలువ ఆయకట్టులో వేలాది ఎకరాలకు సరిపడే వరి నారుముడులు ఎండిపోతుంటే ఇంతవరకూ నీటిని విడిచిపెట్టకపోవడం శోచనీయం. అన్నదాతలతో అధికారులు ఆటలాడుకుంటున్నారు. – కనకల సన్యాసినాయుడు, మడ్డువలస కాలువ ఆయకట్టు రైతు,
ఎంపీటీసీ సభ్యులు, తాలాడ, సంతకవిటి మండలం