
రైలు ఢీకొని వ్యక్తి మృతి
గజపతినగరం: మండలంలోని భూదేవిపేటకు చెందిన గంధవరపు అప్పాలు(71) శనివారం రైలు పట్టాలు దాటుతుండగా గుర్తు తెలియని రైలు ఢీకొని మృతి చెందాడని బొబ్బిలి రైల్వే హెచ్‌సీ బి.ఈశ్వరరావు తెలిపారు. అప్పాలు తన సొంత గ్రామం భూదేవిపేట గ్రామం నుంచి ఆరోగ్య తనిఖీ నిమిత్తం మరుపల్లి గ్రామంలో ఉన్న పీహెచ్‌సీకి బయలుదేరారు. మార్గ మద్యలో రైల్వే ట్రాక్ ఉండడంతో దాన్ని దాటుతుండగా విజయనగరం నుంచి బొబ్బిలి వైపు వెళ్త్తున్న గుర్తు తెలియని రైలు ఢీకొనడంతో అప్పాలు అక్కడికక్కడే మృతి చెందాడని హెచ్‌సీ తెలిపారు. అనంతరం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. మృతుడు గ్రామంలో పూజారిగా ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈయనకు ముగ్గురు కుమారులు ఉన్నారు.