
పీడీఎస్ బియ్యం పట్టివేత
పూసపాటిరేగ: మండలంలోని తిప్పలవలస గ్రామంలో అక్రమంగా నిల్వ వుంచిన 40 బస్తాలు పీడీఎస్ బియ్యం పట్టుకొని కేసు నమోదు చేసినట్టు భోగాపురం సీఎస్‌డీటీ బీవీ మురళీకృష్ణ శనివారం తెలిపారు. గ్రామానికి చెందిన రాయితి లక్ష్మి ఇంట్లో వుంచిన పీడీఎస్ బియ్యాన్ని భోగాపురం, రాజాం, గజపతినగరం, గంట్యాడ సీఎస్‌డీటీలు మురళీకృష్ణ, ఎస్.చిరంజీవి, ఎన్.మూర్తి, కె.తిరుపతి బృందంగా ఏర్పడి తనిఖీలు నిర్వహించగా అక్రమంగా బియ్యం నిల్వ వున్నట్టు కనుగొని సీజ్ చేసినట్టు తెలిపారు. సీజ్ చేసిన బియ్యాన్ని భోగాపురం పౌర సరఫరాలు శాఖ గోడౌన్‌కు తరలించినట్టు తెలిపారు. నిందితులపై 6ఏ కేసు నమోదు చేసినట్టు తెలిపారు. దాడులలో వారితో పాటు వీఆర్‌వో టి.ఈశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు.
పాచిపెంటలో..
పాచిపెంట: మండలంలో పి.కోనవలస చెక్‌పోస్ట్ వద్ద శనివారం వాహన తనిఖీలు చేపట్టగా కొత్తూరు మండలం కడుమ గ్రామం నుంచి ఒడిశా రాష్ట్రం నవరంగాపూర్‌కు తరలిస్తున్న పీడీఎస్ బియ్యం పట్టుబడ్డాయి. తనిఖీల్లో విజిలెన్స్ అధికారులు ఇన్‌స్పెక్టర్ సింహాచలం, సబ్ ఇన్‌స్పెక్టర్ రామారావు, పోలీస్ కానిస్టేబుళ్లు పురుషోత్తమ, తిరుపతిరావు మరియు రెవెన్యూ శాఖ అధికారి హేమలత, పాచిపెంట సీఎస్‌డీటీ పాల్గొన్నారు.