
ఆగి ఉన్న లారీని ఢీకొన్న వేరొక లారీ
బొండపల్లి: ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వచ్చిన మరో లారీ ఢీకొనడంతో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. బొండపల్లి ఎస్‌ఐ మహేష్ తెలిపిన వివరాలు...గొట్టాం బైపాస్ రోడ్డుపై శనివారం వేకువజామున ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వచ్చిన మరొ లారీ బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ఢీకొట్టిన లారీ డ్రైవర్ రెల్లి నాయుడు లారీ క్యాబిన్‌లో ఇరుక్కొనిపోయాడు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ మహేష్ వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. క్యాబిన్‌లో చిక్కుకున్న డ్రైవర్‌ను రక్షించడానికి ప్రయత్నించడగా ఫలితం లేకపోవడంతో తక్షణమే జిల్లా కేంద్రంలో ఉన్న అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారొచ్చి రోప్‌లు, కట్టర్‌లతో శ్రమించి డ్రైవర్‌ను సురక్షితంగా బయటకు తీసి చికిత్స కోసం 108లో జిల్లా కేంద్ర సర్వజన ఆసుపత్రికి తరలించారు.