
సమస్యల పరిష్కారానికి దివ్యాంగుల ఆందోళన
పార్వతీపురం టౌన్: దివ్యాంగుల సమస్యలకు పరిష్కారం చూపాలని దివ్యాంగుల పరిరక్షణ సేవా సమితి జిల్లా అధ్యక్షుడు ముండ్రంగి లచ్చన్న దొర డిమాండ్ చేశారు. శనివారం సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి పర్యటన సందర్భంగా కలెక్టరేట్ వద్ద తమ సమస్యలను నిరసన రూపంలో తెలియజేశారు. అనంతరం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా నూతనంగా ఏర్పడి మూడేళ్లు అయినా నేటి వరకు దివ్యాంగుల సంక్షేమ శాఖ కింద సహాయక సంచాలకుల వారి కార్యాలయం పార్వతీపురంలో ఏర్పాటు చేయాలేదన్నారు. తద్వారా జిల్లాలో గల దివ్యాంగులంతా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. తక్షణమే ఏడీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలన్నారు. గతంలో జిల్లాలో 4 అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా జరిగిన ఏఎల్‌ఐఏంసీవో క్యాంపులలో దివ్యాంగులకు మంజూరైన పరికరాలను వెంటనే ఇప్పించాలన్నారు. నిరసనలో పలువురు దివ్యాంగులు పాల్గొన్నారు.
మంత్రి పర్యటన సందర్భంగా కలెక్టర్ వద్ద నిరసన