
గంజాయితో ముగ్గురి యువకుల అరెస్టు
గుర్ల: మండలంలోని మణ్యపురిపేట వద్దనున్న తారకరామ తీర్థ సాగర్ కాలువపై గంజాయి అమ్మకాలు చేస్తున్న ముగ్గురు యువకులను అరెస్టు చేసినట్టు ఎస్‌ఐ పి.నారాయణ రావు శనివారం తెలిపారు. మణ్యపురిపేట వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ముగ్గురు యువకులు అనుమానాస్పదంగా ఉండడంతో వారి బ్యాగులను తనిఖీ చేయగా కేజీ గంజాయిని పట్టుకొని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. గంజాయి తరలిస్తున్న వారిలో గరికివలసకు చెందిన ఆవాల రాజేష్, కెల్లకు చెందిన మీసాల రమేష్ , పూసపాటిరేగకు చెందిన మంత్రి రామారావు ఉన్నారని వారిని ఆరెస్ట్ చేసి ద్విచక్ర వాహనం, సెల్‌ఫోన్ సీజ్ చేసామని చెప్పారు. గంజాయి కేసులో ముగ్గురిని అరెస్ట్ చేయడంతో గుర్ల పోలీస్ సిబ్బందిని డీఎస్పీ రాఘవులు, సీఐ శంకరరావు అభినందించారు.