
గృహిణి ఆత్మహత్య
విజయనగరం క్రైమ్: విజయనగరం టూ టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ గృహిణి శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనకు సంబంధించి సీఐ శ్రీనివాస్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నెల్లిమర్ల మండలంలోని టొంపలపేటకు చెందిన బుసకల మణి(24) కి పూససాటిరేగ మండలం ఎరుకొండకు చెందిన సురేష్‌తో పైళ్లెంది. వారికి ఒక బిడ్డ ఉన్నాడు. ఇటీవల భార్యాభర్తల మధ్య గొడవలు రావడంతో భర్త సురేష్‌కు చెప్పాపెట్టకుండా విజయనగరంలోని రాజీవ్ నగర్ కాలనీలో ఉంటున్న తన పెద్దమ్మ దగ్గరకు మూడురోజుల క్రితం మణి వచ్చేసింది. ఆ సమయంలోనే విజయనగరం టూటౌన్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో సీఐ శ్రీనివాస్ ఇరువర్గాల వారిని పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చారు. అప్పుడే మణి మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుని రెండురోజుల క్రితం ఎవరికీ చెప్పకుండా విజయవాడకు వెళ్లిపోయింది. దీనిపై ఆమె పెద్దమ్మ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సెల్ ఫోన్ నంబర్ ఆధారంగా ట్రేస్ చేసి విజయవాడలో ఆమెను పట్టుకుని శుక్రవారం విజయనగరం తీసుకువచ్చారు. అయితే అంతలోనే ఏం జరిగిందో ఏమో గానీ పెద్దమ్మ ఇంట్లో ఉంటున్న మణి బాత్రూమ్‌కు అని చెప్పి వెళ్లి ఇంట్లోనే ఉరేసుకుంది. ఇంట్లో ఉంటున్న పెద్దమ్మకు అనుమానం రావడంతో చూసి మణి కొనఊపిరితో ఉండడంతో చుట్టుపక్కల వారి సాయంతో హాస్పిటల్‌కు తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మణి ఆత్మహత్య చేసుకుందన్న విషయం ఆమె కన్నవారికి ఎస్సై కృష్ణమూర్తి తెలియజేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.