
రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీలకు జిల్లా క్రీడాకారులు
విజయనగరం: రాష్ట్రస్థాయిలో జరగనున్న సబ్ జూనియర్స్ బాల బాలికల బాక్సింగ్ పోటీల్లో పాల్గొనే జిల్లా క్రీడాకారుల ఎంపిక పూర్తయింది. ఈ నెల 12, 13వ తేదీల్లో విశాఖపట్నంలోని రైల్వే స్టేడియంలో జరిగే 6వ రాష్ట్ర సబ్ జూనియర్ పోటీల్లో పాల్గొనే జిల్లా క్రీడాకారుల వివరాలు జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ ప్రతినిధులు గురువారం వెల్లడించారు. బాలుర విభాగంలో ఎ.మనీష్, ఎస్.విశాల్, పి. దుర్గాప్రసాద్, కె.హేమేష్ వర్ధన్, కె.కత్యేష్ వర్ధన్, ఎ.యశ్వంత్, వై.రేవంత్, కె.గౌతమ్ గణేష్, బి.సచిన్‌లు ఉన్నారు. అదేవిధంగా బాలికల విభాగంలో బి.మైథిలి, ఎం.ఝాన్సీ, ఎన్.దేవిక, కె.వేణుమాధవి, వి.జాహ్నవి లు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనేందుకు జిల్లా జట్లకు అర్హత సాధించారు. రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలవడంతో పాటు జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించాలని రాష్ట్ర బాక్సింగ్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు డోల మన్మథ కుమార్ ప్రోత్సహించారు. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్, కార్యదర్శి ఇందుకూరి అశోక్‌రాజు, శాప్ బాక్సింగ్ కోచ్ బి.ఈశ్వరరావులు క్రీడాకారులను అభినందించారు.
ఈనెల 12 నుంచి విశాఖలో పోటీలు